2021 నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ఇప్పటికే కొన్ని బాలీవుడ్ జంటలు ముంబాయి నుండి వేరే ప్రదేశానికి వెళ్లాయి. ఆ లిస్ట్ లో అలియా భట్, రణబీర్ కపూర్.. అలాగే దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కూడా ఉన్నారు. తాజాగా న్యూఇయర్ సెలబ్రేషన్ కోసం సిధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ మాల్దీవులకు ప్రయాణమయ్యారు. ఇప్పటికే వీరిద్దరి పై బాలీవుడ్ లో అనేక పుకార్లు ఉన్నాయి. ఈ ఇద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని, ఏ పార్టీకి వెళ్లినా కలిసే వెళ్తున్నారని అంటోంది బాలీవుడ్ మీడియా.

ఈ రోజు అనగా బుధవారం ఉదయం సిద్దార్థ్, కియారా ముంబయి నుండి మాల్దీవులకు వెళ్ళడానికి ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది ఫొటోగ్రాఫర్లు వారిని తమ కెమెరాల్లో బంధించారు. ఆ ఫోటోలలో సిద్దార్థ్ ఆరెంజ్ రంగు ట్రాక్ ప్యాంట్, నలుపు టీ షర్ట్ దానిపై సిల్వర్ రంగు జాకెట్ ధరించి కనిపించాడు. ఈ అందమైన స్టార్ హీరో నల్ల బ్యాక్ ప్యాక్ బ్యాగ్ తగిలించుకొని, తెలుపు, పసుపు బూట్లు తొడుక్కొని, ముఖానికి నల్ల మాస్క్ పెట్టుకొని స్టైలిష్ గా ఎయిర్ పోర్టులోకి వెళిపోయాడు.
ఇక కియారా కూడా తెలుపు రంగు ..అక్కడక్కడ బ్లూమిక్స్డ్ ట్రాక్ ప్యాంటు, తెల్లటి ట్యాంక్ టాప్ లో చాలా సహజంగా రివీల్ అయింది. ఒక స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని, టోపీ పెట్టుకొని , నల్ల మాస్క్ తో కియారా… సిద్దార్థ్ తో కలిసి విమానాశ్రయంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీరిపై నెటిజన్లు ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు.
Must Read ;- ముంబయి ఎయిర్ పోర్టులో మెరిసిన బాలీవుడ్ క్రేజీ పెయిర్











