అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పుడు కండల వీరుడిగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. 2015లో హీరోగా తెరంగేట్రం చేసిన ఈ అక్కినేని వారసుడిని హిట్లు మాత్రం వెక్కిరిస్తున్నాయి. అతని సినిమా వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా ఎవరికీ గుర్తుండటం లేదు. అతను తాజాగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పైనే ఆశలన్నీ ఉన్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ సినిమాలో అఖిల్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడట. ఇందులో అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది.
ఓ పక్క అందరూ పాన్ ఇండియా గోలలో ఉంటే ఈ మిల్కీ హీరో ఎలాగైనా హిట్ కొట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. కొంచం రఫ్ లుక్ లో కనిపిస్తే బెటరేమోనని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. కండలు పెరిగితే మాస్ లుక్ వచ్చేస్తుంది. అందుకేనేమో జిమ్ లో ఇలా కసరత్తులు చేస్తున్నాడు. ఇదంతా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసమా? ఇంకా దేనికైనానా అన్నది తేలాల్సి ఉంది. ఇంతకష్టపడుతున్నాడు కాబట్టి మంచి విజయం సొంతమవ్వాలని కోరుకుందాం.











