కరోనా దెబ్బకు చాలా ప్రతి ప్రభుత్వమూ ఆర్థిక సంక్షోభంలో పడుతోంది. ఎంత సంక్షోభం ఉన్నప్పటికీ.. కొన్ని సంక్షేమ పథకాలను మాత్రం ప్రభుత్వాలు నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి. ఇంటింటికీ నిధులు పంచే కార్యక్రమాలను జగన్ ఎలా ఆపకుండా చేస్తున్నారో.. పండగపూట ఆడపడుచులకు ప్రభుత్వమే చీర పెట్టే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్.. ఈ కరోనా గండం వల్ల ఆగకుండా, జాగ్రత్తగా ఇళ్లకే చీరలు చేర్చే ప్రయత్నంలో ఉన్నారు.
ఇంటి వద్దకే చీర
కరోనా ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులు అందరికీ ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. అక్టోబర్ మొదటి వారంలో చీరల పంపిణీ జరగాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ సారి కరోనా కారణంగా అడపడచులకు వారి ఇంటి వద్దకే చీరలను అందచేయాలని భావిస్తోంది.
ప్రతి ఏటా కోటి మంది మహిళల కు బతుకమ్మ చీరలకు పంపిణీ చేస్తున్నది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో నిరుపేద మహిళల్లో ఆనందం వెల్లివిరిసింది. 2017 అక్టోబర్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ పథకాన్ని ప్రారంభించారు. గతంలో రేషన్ షాప్‌ల ద్వారా చీరలు అందజేశారు. ఈ సారి నేరుగా ఇళ్ళ కే పంపిణీ చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తూ వుంది.
గత ఏడాది పంపిణీ ఇలా
గత ఏడాది కూడా బతుకమ్మ’ బ్రాండ్ చీరల ను పంపిణీ చేసింది. ఆడపడచులకు బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 రకాల డిజైన్లలో చీరలను రూపొందించి పంపిణీ చేసింది. గత ఏడాది సెప్టంబరు 23 నుంచి చీరల పంపిణీని ప్రారంభిం చారు10 లక్షల 9 మీటర్లు, మిగతా 90 లక్షల చీరలు 6 మీటర్ల సైజులో తయారు చేయించి పంపిణీ చేశారు.. సిరిసిల్లలోని నేత కార్మికులతో వీటిని రూపొందించారు.
అర్హత గల మహిళలు చీరలు ధరించడానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా పెద్ద వయసు మహిళల కోసం 9 మీటర్లు చీరలు సిద్ధం చేశారు. ఇలాంటివి సుమారు 10 లక్షల చీరలు సిద్ధం చేశారు. 18 ఏళ్లు పైబడి తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. గత ఏడాది చీరల కోసం మహిళలు రేషన్ షాప్‌ల వద్ద బారులు తీరారు. పట్టణాల్లో పురపాలక కార్యాలయాల్లో పంపిణి చేశారు. గత రెండు, మూడు సంవత్సరాల క్రితం పంపిణీ చేసిన చీరలపై మహిళలు విమర్శించినా గత ఏడాది పంపిణి చేసిన చీరల పై మహిళలు సంతృప్తి వ్యక్తం చేశారు.
కరోనా జాగ్రత్తలు భేష్
రేషన్ షాపుల వద్ద చీరలు పంపిణీ చేసిన సందర్భాల్లో గుంపులుగా జనం చేరడం వంటివి జరిగాయి. అయితే ఇప్పుడు కరోనా కారణంగా.. జనం గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. దానికి తగ్గట్టుగానే.. అసలు ఆడపడుచుల ఇళ్ల వద్దకే చీరలు చేర్చాలనే నిర్ణయం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.











