April 30, 2026 1:59 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అఫిడవిట్ ఇవ్వడానికి సీఎం జగన్ సిద్ధమేనా?

జగన్ కట్టుబడేందుకు సుప్రీం కోర్టు ‘అఫిడవిట్’ అడిగిందనే వాదన ఇప్పుడు రాజకీయవర్గాల్లో  చర్చనీయాంశంగా ఉంది.

January 2, 2021 at 3:20 PM
in Andhra Pradesh, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

గత అక్టోబరులో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై,  హైకోర్టు సీజేగా పనిచేసి ఇటీవలే బదిలీ అయిన జస్టిస్ జేకే మహేశ్వరిలపై ఆరోపణలు చేస్తూ ఏపీ సీఎం జగన్ లేఖ రాయడం, ఆ లేఖను బయటపెట్టడం అప్పట్లో సంచలనం రేపింది. అయితే రెండునెలల తరువాత తెలంగాణ, ఏపీ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో నిన్న ఇండియన్ఎక్స్ ప్రెస్ పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. ఆ కథనం ప్రకారం.. జగన్ చేసిన ఫిర్యాదుపై సీజేఐ స్పందించారని, జగన్ ను అఫిడవిట్ రూపంలో ఆ ఫిర్యాదును అడిగారని, అదే సమయంలో జస్టిస్ జేకే మహేశ్వరిని కూడా వివరణ అడిగారని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణను వివరణ అడిగారా.. లేదా అనే అంశంపై స్పష్టత రాలేదని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ వార్తా కథనం ఆ పత్రికలో మాత్రమే వచ్చింది. తరువాత ఇతర మీడియాల్లో, వెబ్ సైట్లలో కనిపించింది.

ఇక అసలు విషయానికి వస్తే.. సాధారణ న్యాయమూర్తులపై చిన్న ఆరోపణ, ఫిర్యాదు వచ్చినా సుప్రీంకోర్టు స్పందిస్తుంది. దీనిపై అంతర్గతంగా విచారణ జరుపుతుంది. అది కామన్. వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఉన్నప్పుడే.. ఆ వ్యవస్థలు రాజ్యాంగాన్ని పరిరక్షించగలుతాయి. ప్రతిష్టను కాపాడుకోగలుగుతాయి. అలాంటిది ఓ రాష్ట్ర సీఎం, కొన్ని కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తిగా ఉన్న వైఎస్ జగన్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో రోస్టర్ లో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తిపై ఆరోపణ చేస్తే సుప్రీం కోర్టు స్పందించకుండా ఉంటుందని అనుకోలేం. అసలు నిజమేంటో తెలసుకున్నప్పుడే విషయం బయటకు వస్తుంది.

నిన్నటి ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనంలో.. సీజేఐ జగన్ ను అఫిడవిట్ రూపంలో ఫిర్యాదును ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టు పేర్కొంది. అది గోప్యంగా జరిగిందా.. అంత అవసరం ఉందా అనే విషయానికి వస్తే.. గత అక్టోబరులో జగన్ సుప్రీం కోర్టుకు లేఖ రాయడంకంటే దాన్ని బహిరంగ పర్చడం ఎక్కువ చర్చనీయాంశమైంది. గతంలో చాలామంది సీఎంలు, ప్రజాప్రతినిధులు వివిధ స్థాయుల్లో ఇలాంటి ఫిర్యాదులు చేసినా.. అవి కొంత గోప్యంగా ఉండేవి. ఎందుకంటే వ్యవస్థల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు సంక్షోభం తలెత్తకుండా ఉండాలంటే వాటిని సానుకూల వాతావరణంలో పరిష్కరించుకునే ఉద్దేశమే ఇందుకు కారణం. అలా కాకుండా బహిరంగంగా ఆ ఆరోపణలు జరిగితే ‘విశ్వసనీయత’కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ రాసిన లేఖ బహిరంగ పర్చడం వివాదాస్పదమైంది.  ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టునుంచి నిబంధనల ప్రకారం సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్ లో అడిగి ఉండవచ్చని, ఆధారాలు ఉంటే ఇవ్వాల్సిందిగి సూచించే అవకాశం ఉంది.

ఇక ‘అఫిడవిట్’ విషయానికి వస్తే.. తాను చేసిన వ్యాఖ్యలను, తాను పేర్కొన్న అంశాలకు, తాను ఏం చెప్పాలనుకున్నానో వాటికి కట్టుబడి ఉన్నానని చట్టపరంగా సమ్మతి తెలియజేయడమే అఫిడవిట్. భవిష్యత్ కాలంలో మంచి జరిగినా, చెడు జరిగినా దాన్ని కట్టుబడి ఉండేందుకు ఆ అఫిడవిట్ ఉపయోగపడుతుంది. చట్టబద్దత వస్తుంది. ఇక అదే కథనంలో పేర్కొన్న మరో అంశం.. హైకోర్టు చీఫ్ జస్టిస్ గా అప్పుడు ఉన్న జేకే మహేశ్వరిని వివరణ అడిగారనే అంశం. సాధారణంగానే న్యాయవ్యవస్థ పరిధిలో ఉండే వారందరూ.. సుప్రీంకోర్టు కు నిరంతర జవాబుదారి. అంటే న్యాయస్థానాల్లో జరిగే ప్రతి కార్యకలాపాల వివరాలు వివిధ స్థాయులను బట్టి సుప్రీంకోర్టుకు చేరతాయి. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఫిర్యాదులో పేర్కొన్న వివరాలను సుప్రీంకోర్టు సేకరించే అవకాశం ఉంది. అయితే వ్యక్తిగతంలో ఈ వివరాలు అడిగారా లేదా అనేది ఎవరికీ తెలియదు. కాని జస్టిస్ జేకే మహేశ్వరి దాదాపు 300 పేజీల రూపంలో నివేదిక ఇచ్చారని ఆ కథనం చెబుతోంది.

ఇక జస్టిస్ ఎన్వీ రమణ విషయానికి వస్తే.. ఆయన సుప్రీంకోర్టులో సీనియార్టీలో రెండో స్థానంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన విషయాలు సాధారణంగా బయటకు రావు. ఈ కేసు విచారణ లో ఉన్న నేపథ్యంలో అంతకుమించి ఈ కేసులో వివరాలు వెల్లడించడం కూడా కోర్టు ధిక్కరణ గా పరిగణించే అవకాశం కూడా ఉంది.  సుప్రీంకోర్టులో తీర్పులు, కేసుల వివరాల విషయంలో ప్రత్యేకంగా లీగల్ వెబ్ సైట్లు, లీగల్ మ్యాగజైన్లు ముందుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ కేసు విషయాలు ఆ ఒక్క పత్రికలోనే ఎందుకు వచ్చాయనే చర్చ నడుస్తోంది. మొత్తంమీద ఈ కథనాన్ని పరిశీలిస్తే.. ఆ కథనంలో చెబుతున్న విశ్వసనీయ వర్గాలెవరనే సందేహం కూడా వ్యక్తం అవుతోంది.

మరోవైపు ఏపీ సీఎం జగన్ రాసిన లేఖలోని ఆరోపణలకు ఆధారాలున్నాయా, ఉంటే ఎలాంటి ఆధారాలున్నాయి.. ఆయన చేసిన ఆరోపణల్లోని కేసులు తరువాతి అప్పీల్ కు వెళ్లలేదా.. వెళ్లినా నిలవలేదా.. ఇలాంటివన్నీ ఇంకా బయటకు రావాల్సిన విషయాలు. అదే సమయంలో ఆరోపణలకు ఆధారాలు ఉంటే  పరిస్థితి వేరుగా ఉంటుందని,  ఆధారాల్లేకుంటే మరో రకంగా ఉంటుందనే చర్చ నడుస్తోంది.

Tags: leotop
Previous Post

రష్మిక మందన్న పంట పండినట్టే!

Next Post

దాదాకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక..

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఆస్కార్ ఫైనల్ లిస్ట్ లో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’

లోకేష్‌కు ప్రమోషన్..వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

సుమంత్ అశ్విన్  ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. !

Bollywood Actress Nyeisha Rajput Dazzling Still

సిక్కోలులో టీడీపీ, వైసీపీ రాజకీయ సిగపట్లు

మోషన్ పోస్టర్ :  సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist