సినిమాల్లో సక్సెస్ లే అన్నీ మాట్లాడిస్తాయి. అలా గొల్డెన్ లెగ్ భామగా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ఈ రంగంలో ఎంతమందున్నా ఇప్పుడు రష్మిక మందన్నా పైనే అందరి దృష్టీ. కెరీర్ విషయంలో ఆమెను ఓ స్టార్ హీరో గైడ్ చేస్తున్నాడన్న మాట ఎక్కువగా వినిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఎదగాలంటే పబ్లిక్ రిలేషన్స్ చాలా ముఖ్యం, సక్సెస్ తో పాటు ప్రాపర్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తేనే చిత్ర పరిశ్రమలో నాలుగు రోజులు ఎక్కువ ఉండగలం అని ఫిల్మ్ ఎక్స్ పర్ట్స్ చెబుతుంటారు.
రష్మిక మందన్నా కన్నడ సీమ నుంచి తెలుగు సినిమాల్లోకి వచ్చి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. వరుస సక్సెస్ లు రష్మిక ను పలకరించాయి. హీరో విజయ్ దేవరకొండతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి యూత్ లో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం రష్మిక సూపర్ స్టార్ రేంజీ హీరోలు సరసన నటిస్తూ బిజీగా ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ‘పుష్ప’లో రష్మిక హీరోయిన్ గా సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే సినిమాల్లో బిజీగా ఉన్న రష్మిక మాత్రం తెలుగు బ్రాండ్ అండార్సమెంట్స్ లో చాలా వెనకబడిపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఎంత పెద్ద సినిమాలు చేస్తున్నా, ఎన్ని సక్సెస్ లు వచ్చినా, ఎంతో ఫాలోయింగ్ ఉన్నా రష్మికకు మాత్రం యాడ్ బ్రాండింగ్ ఆఫర్లు రావడంలేదు. అయితే ఈ విషయంలో రష్మికను హీరో విజయదేవరకొండ తెగ ఎంకరేజ్ చేస్తున్నాడట. తనకు వచ్చే బ్రాండ్ అండార్స్ మెంట్స్ లో రష్మికను కూడా తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నాడని తెలిసింది. కే ఎల్ ఎమ్ ఫ్యాషన్ మాల్ బ్రాండింగ్ రష్మికకు రావడం వెనుక విజయ్ హస్తం ఉందని సినిమా వర్గాల భోగట్టా. వీరిద్దరూ కలిసి తాజాగా జరిగిన ఈ బ్రాండ్ యాడ్ షూట్ లో కూడా పాల్గొన్నారని టాక్. ఈ గీత గోవిందం మరి ఎక్కడిదాకా వెళుతుందో చూడాలి.











