రాజ్యసభలో సోమవారం నాడు ఛైర్మన్ వెంకయ్యనాయుడిపై చేసిన వాఖ్యలకు విజయసాయిరెడ్డి ఈ రోజు క్షమాపణలు చెప్పారు. రాజ్యసభ చైర్మన్ పట్ల తనకు గౌరవం ఉందని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాని అన్నారు. రాజ్యసభ ఛైర్మన్‌ను అగౌరవపరచాలని తాను అనుకోలేదని, ఆవేశంలో మాట్లాడానంటూ తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నిన్న రాజ్యసభలో విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలకు వెంకయ్యనాయుడు సమాధానమిస్తూ తాను ఆ పదవి చేపట్టేముందే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నానని, బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు.
జగన్ స్టయిల్ : రాళ్లుపోయి పేర్లు వచ్చె టాం..టాం..టాం..!
మనలో చాలా మందికి, కొత్తతరం పిల్లలకు కూడా ఈ కథ తెలుసు. తెలియనివారికోసం...










