డైరెక్టర్ మారుతి ప్రతిరోజు పండగే సినిమాతో సక్సస్ సాధించిన తర్వాత తదుపరి చిత్రం ఎనౌన్స్ చేయడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. చాలా టైమ్ తీసుకున్నాడు అనేకంటే.. చాలా టైమ్ పట్టింది అనడం కరెక్ట్ అని చెప్పచ్చు. మాస్ మహారాజా రవితేజతో సినిమా అనుకుంటే.. ఆఖరికి యాక్షన్ హీరో గోపీచంద్ తో సినిమా ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
అయితే.. హీరో ఫిక్స్ అయ్యాడు ఇక సినిమాని సెట్స్ పైకి తీసుకెళదాం అనుకుంటే.. హీరోయిన్ కష్టాలు మొదలయ్యాయి. అదేంటి అంటారా..? ఇందులో ఫిదా బ్యూటీ సాయిపల్లవిని హీరోయిన్ గా అనుకున్నారు. అయితే.. సాయిపల్లవి ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుంది. అలాగే విరాటపర్వం సినిమాలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న సినిమాలో నటిస్తుంది. అందుచేత డేట్స్ ప్రాబ్లమ్ వలన ఈ సినిమాకి నో చెప్పిందట.
చాలా మంది హీరోయిన్స్ ను అనుకున్నప్పటికీ ఎవరు సెట్ కాలేదు. ఆఖరికి ప్రతిరోజు పండగే సినిమాలో ఏంజిల్ ఆర్నా పాత్ర పోషించిన రాశీ ఖన్నానే ఈ సినిమా కోసం ఎంపిక చేశారని తెలిసింది. గోపీచంద్ – రాశీఖన్నా కలిసి జిల్, ఆక్సిజన్ సినిమాల్లో నటించారు. మూడోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో కూడా రాశీ ఖన్నా క్యారెక్టర్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని తెలిసింది. దీనికి పక్కా కమర్షియల్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ.. అక్టోబర్ 1న మూవీ రిలీజ్ అని డేట్స్ ఫిక్స్ చేసేయడం విశేషం.











