ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగబోనంటూ సీఎం కేసీఆర్ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని, ఈసారి ఆయనకు జనం.. కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ఇవ్వకపోతే 2018 ఎన్నికల్లో ఓట్లే అడగనన్న వ్యక్తి… రాష్ట్రంలో సగం గ్రామాలకు కూడా నీళ్లు ఇవ్వకుండా ఏ మొహం పెట్టుకుని ఓట్లడిగారని ప్రశ్నించారు. కుర్చీ వేసుకుని కూర్చొని ఏఎస్ఎల్బీసీ టన్నెల్‌ను పూర్తిచేయిస్తానని ఆరేళ్ల కిందట చెప్పారు కదా.. ఇప్పటిదాకా కుర్చీ దొరకలేదా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
నాగార్జునసాగర్ లో గిరిజనుల భూముల్ని టీఆర్‌ఎస్ నేతలు కబ్జా చేస్తుంటే.. సీఎం ఎందుకు మాట్లాడరని బండి సంజయ్ నిలదీశారు. ‘‘పోడు సమస్య, గిరిజనుల రిజర్వేషన్‌పై ప్రశ్నిస్తే కుక్కలని సంబోధిస్తావా? గుర్రంబోడు తండాలో గిరిజనుల భూములను టీఆర్‌ఎస్ నేత ఆక్రమించుకుంటే.. అడగడానికి వెళ్లిన వారిపై గూండాలతో దాడి చేయించారు. 40 మందిని రెండు నెలల పాటు జైల్లో పెట్టారు’’ అని ధ్వజమెత్తారు. సీఎం చెప్పిక కల్లబొల్లి మాటలను నమ్మడానికి సాగర్ ప్రజలు సిద్ధంగా లేరని, దుబ్బాక తీర్పే ఇక్కడా రానుందని జోస్యం చెప్పారు.
Must Read ;- పిడికెడు లేరు.. తొక్కి పడేస్తా..











