గడిచిన 16 రోజులుగా తనకు అండగా నిలచిని ప్రతి ఒక్కరికి నర్సాపురం ఎంపీ రఘురామరాజు ధన్యవాదాలు తెలిపారు. బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు.తాను జైలు నుంచి బయట పడాలని,త్వరగా కోలుకోవాలని చాలామంది రామకోటి, శివకోటి, సాయికోటి రాశారని,వారందరికి శిరస్సు వంచి పాదాభివందనం చేసినా తక్కువే అని అన్నారు.ఈ రోజు జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో జరిగిన విచారణ గురించి ఆయన ప్రస్తావించారు. వారు దాఖలు చేసిన కౌంటర్‌లో తనపై కేసులున్నట్లు పేర్కొన్నారన్నారు.తనపై కేసులున్నమాట వాస్తవమేనని,ఏ కేసులోనూ తాను దోషిగా తేల లేదన్నారు.దానిపై తాము వారం రోజుల్లో సీబీఐ కోర్టులో వివరణ సమర్పిస్తామన్నారు.న్యాయవ్యవస్థలపైన,కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిపైన తనకు నమ్మకం ఉందని,అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడుతూనే ఉంటానని రఘురామరాజు పేర్కొన్నారు.
బ్రాహ్మణికి అరుదైన గౌరవం… నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్..!
rహెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి మరో ప్రతిష్టాత్మకమైన గుర్తింపును సొంతం...










