నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింద్ నిలిచిపోగా.. అదే ఎఫెక్ట్ తో విడుదల తేదీ కూడా వాయిదా పడింది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే.. అఖండ షూటింగ్ ను తిరిగి ప్రారంభించబోతున్నారు. ఇదిలా ఉంటే.. దీని తర్వాత బాలయ్య నటించబోతున్న సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తొలిసారిగా నటించబోతున్నారు. అందుకే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు గోపీచంద్ రవితేజ తో క్రాక్ తీసి బ్లాక్ బస్టర్ కూడా కొట్టాడు. వాస్తవ సంఘటనలు ఆధారంగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను రూపొందించనున్నాడు గోపీచంద్ మలినేని. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ నటించబోతున్నట్టు సమాచారం.
నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష పేరు వినిపించింది. అయితే ప్రస్తుతం ఆమెకి ఎలాంటి క్రేజ్ లేని కారణంగా ఆమెను పక్కన పెట్టారని.. అందుకే ఆమె ప్లేస్ లో క్రాక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రుతి హాసన్ నే ఖాయం చేశారని టాక్. అలాగే.. గోపీచంద్ డైరెక్ట్ చేసిన బలుపులో కూడా శ్రుతి హాసన్ నటించింది హిట్ అందుకుంది. ఈ కారణాల వల్లనే బాలయ్య సరసన భాగ్యలక్ష్మి శ్రుతి హాసన్ ను కథానాయికగా ఎంపిక చేశారని తెలుస్తోంది. మరి బాలయ్య కి శ్రుతి హాసన్ ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.
Must Read ;- అదిరిపోయే రేంజ్ లో ‘అఖండ’ ప్రీరిలీజ్ బిజినెస్