ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, మంత్రి స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. ఈఎస్ఐ స్కాం నిందితునితో లాలూచీ పడినట్టుగా, అతని నుంచి లంచంగా తీసుకున్న బెంజి కారును తన కొడుకు ఈశ్వర్ కు పుట్టినరోజు కానుకగా ఇచ్చినట్టుగా రాజకీయవర్గాల్లో సంచలనం రేకెత్తిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆరోపణలు తీవ్రంగా ఉండడంతో మంత్రి జయరాం వీడియో ద్వారా వివరణ ఇచ్చుకున్నారు గానీ.. అందులో కూడా.. ఆయన తనకు సంబంధం లేదని సరిగా సమర్థించుకోలేకపోయారు.
నా కొడుకు విమానం పక్కన నిల్చుని ఫోటో దిగితే అది నాదేనా.. రైలు పక్కన నిల్చుంటే అది నాదేనా? నా కొడుకుకు ఫేస్ బుక్ లో లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారిలో ఎవడో ఒకడు అతని చేత్తో కారు తాళం తీసుకుంటే అది మా కారు అయిపోతుందా.. అని మంత్రిగారు సవాలు విసిరారు.
ఆ కారు రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉందో చూడండి.. అయ్యన్నపాత్రుడు కు వయసు అయిపోయి.. ఏది పడితే అది మాట్లాడుతున్నారు.. కావాలంటే తేల్చండి.. అంటూ మంత్రిగారు ఆగ్రహించారు.
అయితే జయరాం అసలు పాయింట్ మిస్సయ్యారు. తెలుగుదేశం నాయకులు చేసిన ఆరోపణలను ఆయన పరోక్షంగా ఒప్పుకున్నారు. తెలుకపల్లి కార్తీక్ అనే ఏ 14 నిందితుడు, గుమ్మనూరు జయరాంకు బినామీ అని.. అందుకే కార్తీక్ పేరుతో కొన్న, రిజిస్ట్రేషన్ అయిన కారును గుమ్మనూరు జయరాం కొడుకు ఈశ్వర్ వాడుకుంటున్నాడనేదే అసలు ఆరోపణ. ఇప్పుడు జయరాం మాటలు కూడా ఆ ఆరోపణలను బలపరిచే విధంగానే ఉన్నాయి.
ఇప్పుడు వివాదం రేగింది గనుక.. కొన్నాళ్లు ఆ కారును వారు వాడకుండా ఉంచేయవచ్చు గానీ.. మంత్రి కొడుకు ఈశ్వర్.. ఆ కారులో చేసిన హల్‌చల్ తెలియజెప్పే వీడియోలు అనేకం ఉన్నాయి.. ఇవన్నీ వేరువేరు సందర్భాల్లో తీసిన వీడియోలు కావడం విశేషం. ఈ వీడియోలు చూస్తే.. ఆ కారుకు – తన కొడుకుకు సంబంధం లేదని బహుశా మంత్రి జయరాం కూడా చెప్పలేరేమో!!
వీడియో చూడండి :











