దాచేపల్లిలో తెరచుకున్న దొంగనోట్ల ముద్రణాలయం..!
గుంటూర జిల్లా దాచేపల్లిలో ఓ కానిస్టేబుల్! ఏకంగా దొంగనోట్ల ముద్రణాలయాన్ని తెరిచాడు!! అక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో పథకం ప్రకారం నోట్ల చలామణికి స్కేచ్ గీశారు. గుంటూరు జిల్లా మేడికొండురులో నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి తిగలాగితే.. దాచేపల్లిలో డొంక కదిలింది. ఈ దొంగనోట్ల చలామణి కీలక సూత్రదారి దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించే వ్యక్తిగా గుర్తించారు. శనివారం తెల్లవారుజామును గుంటూరు నుంచి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాచేపల్లికి వచ్చి సదరు ఆ కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారిస్తే .. దొంగ నోట్ల గుట్టు మొత్తం రట్టైంది. ఇదే ముఠాకు చెందిన మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో యథేచ్ఛగా నకిలీ కరెన్సీ చలామణి
గుంటూరు జిల్లా దాచేపల్లి కేంద్రంగా సదరు కానిస్టేబుల్ లక్షల్లో రూ.500,200,100 నోట్లను కలర్ జీరాక్స్ మిషన్ ద్వారా ఫ్రింట్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు ముఠాలుగా విడిపోయి చలామణి చేస్తున్నారు. మొత్తం కోట్లల్లో నోట్లను ముద్రించి .. మార్పిడి చేసినట్లు పోలీసు విచారణ తేలిన నిజాలు. ఇప్పటికే దాచేపల్లి కానిస్టేబుల్ తోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఠాలో మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. సమగ్ర దర్యాప్తునకు ఇప్పటికే రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశించాడు.











