ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ గతంలో వచ్చింది. ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి కానీ.. కొన్ని కారణాల వలన ఆలస్యం అయ్యింది. త్వరలో సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ ఫిక్స్ అని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కైరా ప్లేస్ లో సమంత అయితే.. బాగుంటుందని ఎన్టీఆర్, కొరటాల అనుకుంటున్నారట. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే.. తారక్ తో సమంత తెరను పంచుకోవడం ఐదవసారి అవుతుంది.
గతంలో సమంత ఎన్టీఆర్ తో రామయ్యా వస్తావయ్యా, రభస, బృందావనం, జనతా గ్యారేజ్ చిత్రాల్లో నటించింది. వీటిలో రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ అవ్వగా మరో రెండు చిత్రాలు అంచనాల్ని అందుకోలేకపోయాయి. అయితే.. జనతా గ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ కాబట్టి సామ్ కాంబినేషన్ అతనికి కలిసొచ్చింది. అందుకనే.. కొరటాల మరోసారి అదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి.. త్వరలో అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి.