హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ప్రతిష్ఠాత్మకమైన గ్రేట్ వర్క్ ప్లేస్ గుర్తింపును సాధించింది. తద్వారా కార్పొరేట్ ప్రపంచంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ గుర్తింపు కేవలం అవార్డు మాత్రమే కాదు, హెరిటేజ్ సంస్థకు తన ఉద్యోగుల పట్ల ఉన్న నిబద్ధతకు, వారిని కుటుంబ సభ్యులుగా చూసే సంస్కృతికి నిదర్శనం. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఈ గుర్తింపు వచ్చిందంటే ఉద్యోగులకు ఆ సంస్థ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు.
…………….
ఇక, ఈ అద్భుతమైన విజయానికి ప్రధాన కారణం హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి గారే. నారా బ్రాహ్మణి దార్శనికత, నిబద్ధతతోనే ఈ సక్సెస్ సాధ్యమైంది. బ్రాహ్మణి నేతృత్వంలోని హెరిటేజ్ సంస్థ…ఉద్యోగుల సంక్షేమానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తోంది. బ్రాహ్మణి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం, వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లాంటి విధానాలు హెరిటేజ్ సంస్థ గ్రేట్ వర్క్ ప్లేస్ గుర్తింపు పొందడానికి కారణమయ్యాయి.
…………….
నారా బ్రాహ్మణి కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, ఓ లీడర్‌గానూ ముందుండి హెరిటేజ్ సంస్థను ముందుకు నడిపిస్తున్నారు. ఉద్యోగుల ఆరోగ్యానికి, కెరీర్ అభివృద్ధికి ఎంతగానో ప్రాధాన్యమిస్తున్నారు. ఉద్యోగులకు సరైన శిక్షణ, ఎదుగుదలకు అవకాశాలు కల్పించడం, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలు బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా ఫోకస్ పెట్టారు. ఈ విధానం సంస్థ పట్ల ఉద్యోగులలో నిబద్ధతను, విశ్వసనీయతను పెంపొందించడమే కాకుండా, సంస్థ లక్ష్యాలను చేరుకోవడంలో వారిని భాగస్వాములను చేసింది.మొత్తంగా, హెరిటేజ్ ఫుడ్స్‌కు లభించిన ఈ గ్రేట్ వర్క్ ప్లేస్ గుర్తింపు సంస్థ బలమైన విలువలు, అద్భుతమైన నాయకత్వానికి అద్దం పడుతుంది.











