మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ త్వరలో తీయబోయే సినిమాపై ఒక వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కాని ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమాకోసం రెడీ అవుతాడు తారక్. తారక్ – త్రివిక్రమ్ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
ఇక తారక్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ కాస్త లేట్ అవుతుందని ఈలోగా త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా ప్లాన్ చేసాడని వార్తలొచ్చాయి. కానీ అవి పుకార్లు గానే మిగిలిపోయాయి. తాజాగా త్రివిక్రమ్ ఒక యంగ్ హీరోకు స్టోరీ చెప్పాడని సమాచారం. ఆ హీరో ఎవరో కాదు ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో క్రేజీ హీరోగా మారిపోయిన రామ్. ఇటీవలే త్రివిక్రమ్, రామ్ కు కథ వినిపించాడని త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయట. ఈ సినిమాను కూడా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట. త్వరలోనే ఈ సినిమాని ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం. ఈ వార్త నిజమైతే హీరో రామ్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనని టాలీవుడ్ టాక్. రామ్ అభిమానులు కూడా త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలని ఎప్పటినుండో కోరుకుంటున్నారు. ఈ వార్త నిజమైతే అభిమానుల పండుగ చేసుకుంటారు. ఈవార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.