అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’ నూతన దర్శకుడు రమేష్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్నారు. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్‌చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవలే రానా దగ్గుబాటి చేతుల మీదుగా టైటిల్ పోస్టర్ విడుదల కాగా దానికి విశేషమైన స్పందన లభించిందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇప్పడు క్యాస్ట్ రివీల్ (నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు) పోస్టర్‌తో ముందుకొచ్చింది. ఈ పోస్టర్ ను సాయిధరమ్ తేజ్ విడుదలచేశారు.
ఈ పోస్టర్లో అనసూయ భరద్వాజ్ గర్భం ధరించినట్లు. కనిపిస్తూ… చేతిలో ఫేస్ మాస్క్ తో కోపంగా ఉండగా.. అశ్విన్ విరాజ్ సీరియస్ గా కనిపిస్తూ వెనుక వైపు తిరిగి కనిపిస్తున్నాడు. దీనిని బట్టి చూస్తుంటే ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్లే ఉంది. అంతేకాడు లిఫ్ట్ కు, సినిమాలోని కధకు ఎదో లింక్ ఉండనే ఉందని అర్థమౌతోంది. మొత్తం మీద ఉత్కంఠభరిత, ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం సాగుతుందని చిత్రబృందం చెబుతోంది.
షూటింగ్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ కాగా గుణ బాలసుబ్రమణియన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో వైవా హర్ష, అనీష్ కురువిల్లా, కాదంబరి కిరణ్, అర్చనా అనంత్, మౌనికా రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, అన్నపూర్ణ, సమీర్ బాబీ రాఘవేంద్ర తదితరులు తారాగణం.
Must Read ;- వరుస ప్లాపులేనా! ఈ సారైనా హిట్టొచ్చేనా?











