బుల్లితెర ముద్దుగుమ్మలు అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మొరుస్తూ ఉంటారు. అయితే ఇలా టీవీ నుంచి సినిమాల్లోకి వచ్చే వారిలో చాలా మంది సక్సెస్ అవ్వరు. ఒకవేళ సక్సెస్ వచ్చినా మెయిన్ లీడ్ గా కొనసాగే అతి కొద్ది మంది మాత్రమే ఉంటారు. ప్రస్తుతం తెలుగునాట హాట్ యాంకర్స్ లో కొనసాగుతున్న అనసూయ, రష్మీ, వర్షిణీ ఇలా చాలా మంది సినిమాల్లోకి రావాలని ట్రై చేస్తున్నవారే. ఈ బ్యాచ్ లో రష్మీ మిగతా వారికంటే కాస్త ముందజలోనే ఉంది. స్కిన్ షోకి ఏ మాత్రం మొహమాటం పడని ఈ హాట్ యాంకర్ వెండితెర పై కూడా తన అందాలతో కుర్రాళ్లకి ఎర వేయడానికి చాలా సార్లు ట్రై చేసింది.
వాస్తవానికి జబర్ధస్థ్ కామెడీ షోతో పాపులరైన రష్మీ ఎప్పటినుంచో సినిమాల్లో ఉంది కానీ జనాల్లో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. జబర్ధస్థ్ షో హిట్ అవ్వడంతో రష్మీకి సినిమా ఆఫర్లు బాగానే వస్తున్నాయి. గుంటూర్ టాకీస్ లో రష్మీ ఆరబోసిన అందాలకి ప్రతిఫలంగా ఈ బ్యూటీ పై తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ గ్రూపులు కూడా తయారయ్యాయి. అందాలైతే ఆరబోస్తుంది కానీ రష్మీ వెండితెరపై సరైన సక్సెస్ అందుకోలేకపోయింది, దీంతో ఈ బ్యూటీ హిట్ కోసం రకరకాలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఇక తాజాగా ఈ బ్యూటీ హీరో నందు ఆనంద్ కృష్ణ కి జంటగా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాను గనుక జనాలు ఆదరిస్తే రష్మీ కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఖాతా తెరిచినట్లే అని ఈ బ్యూటీ పై ప్రస్తుతం సినీ జనాలు మధ్య కామెంట్స్ వినిపిస్తున్నాయి. రష్మీ తనకొచ్చిన క్రేజ్ తో కొందరు అభిమానుల్ని కూడగట్టుకొని స్ట్రై డాగ్స్ కేర్ అనే సంస్థని నెలకొల్పి, వీధి కుక్కల్ని సంరక్షించే కార్యక్రమం చేస్తూ ఉంటుంది. త్వరలోనే సినిమాల్లోనూ రష్మి విజయమంత్రాన్ని జపించవచ్చేమో చూద్దాం.