కొన్ని సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో నటించిన నందకిశోర్ ఇప్పుడు హీరోగా మారారు. ఆయన హీరోగా పరిచయమవుతున్న చిత్రం `నరసింహపురం. సిరి హీరోయిన్ గా నటిస్తుండగా.. యువనటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు. శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వం వహిస్తున్నారు. గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో శ్రీరాజ్ బళ్ళా-టి.ఫణిరాజ్ గౌడ్- నందకిశోర్ ధూళిపాల సయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా.. తాజాగా మోషన్ పోస్టర్ ను సీనియర్ హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ. ఈ చిత్రాన్ని మలిచారు. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభిస్తోంది.
శ్రీకాంత్ మాట్లాడుతూ… “మోషన్ పోస్టర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. చాలాకాలంగా నాకు మిత్రుడుగా ఉన్న సహ క్రికెట్ క్రీడాకారుడు నందు (నందకిశోర్) హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
హీరో నందకిషోర్ మాట్లాడుతూ.. “ఏడాదిన్నరగా మేము పడుతున్న కష్టానికి ప్రతిఫలమే ఈ చిత్రం. దర్శకుడు . శ్రీరాజ్ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు“ అని అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీరాజ్ బళ్ళా మాట్లాడుతూ…” నందకిషోర్ ప్రతిభను పూర్తి స్థాయిలో వెలికి తెచ్చే చిత్రమిది. ఈవారం క్లయిమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తాం. దాంతో షూటింగ్ పార్ట్ ముగుస్తుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలవుతాయి.” అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సిరి హనుమంతు, నిర్మాతల్లో ఒకరైన ఫణిరాజ్ గౌడ్, సంగీత దర్శకులు ఫ్రాంక్లిన్ సుకుమార్, వి-ఎఫెక్ట్స్ చందు ఆది తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ మాధవి, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫేమ్ విజయ్ కుమార్, రవివర్మ, అరవిందసమేత ఫేమ్ రంగధామ్, , సంపత్, ఫణిరాజ్, స్వామి, శ్రీకాంత్, శ్రీకర్, శివ, జునైద్’, గిరిధర్, సాయిరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటర్: శివ వై.ప్రసాద్, పాటలు: గడ్డం వీరు, సంగీతం: ఫ్రాంక్లిన్ సుకుమార్, నిర్మాతలు: శ్రీరాజ్ బళ్ళా, టి.ఫణిరాజ్ గౌడ్, నందకిశోర్ ధూళిపాల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా.“











