టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్.. రీసెంట్ గా ‘ఉమామహేశ్వరా ఉగ్రరూపస్య’ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ తో వరుస గా కొత్త సినిమాల్ని ట్రాక్ ఎక్కిస్తున్నాడు. మొన్నామధ్య తమన్నా కథానాయికగా ‘గుర్తుందా శీతాకాలం’ అనే మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నేడు ‘తిమ్మరుసు’ అనే వైరెటీ కథాంశం కలిగిన మరో సినిమా షూటింగ్ ను షురూ చేశాడు. ‘అసైన్ మెంట్ వాలి’ అనే ట్యాగ్ లైన్ తో .. కోర్ట్ రూమ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొత్త దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి.
‘తిమ్మరుసు’ సినిమా షూటింగ్ ఈ రోజు హైద్రాబాద్ లో లాంచనంగా ప్రారంభమైంది. ఈ లాక్ డౌన్ లో సినిమాను అనౌన్స్ చేసిన మేకర్స్ .. ఇటీవల షూటింగ్స్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో .. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ కు సన్నద్ధమైంది చిత్ర యూనిట్. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, యస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి నిర్మాతలు మహేశ్ కోనేరు, సృజన్ నిర్మాతలు. ప్రియాంకా జవాల్కర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్టు .. సత్యదేవ్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియచేశాడు.
After 8 months we are back to the place we love. #thimmarusu rolls from today. As always need your abundant love and wishes. @smkoneru @nooble451 @SharanDirects@EastCoastPrdns@SOriginals1@vamsikaka #PriyankaJawalkar pic.twitter.com/w1FM1uSOXK
— Satya Dev (@ActorSatyaDev) October 21, 2020











