`సవ్యసాచి` సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. పూరి జగన్నాథ్ `ఇస్మార్ట్ శంకర్`తో తెలుగులో తొలి విజయం అందుకుంది నిధి. ఈ విజయంతో వరుస సినిమాలను సైన్ చేసింది. నిధి ప్రస్తుతం ఓ టాలీవుడ్ అగ్ర హీరోతో డేటింగ్ చేస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ అమ్మడు ఆ హీరోతో బాగా క్లోజ్ గా ఉంటోందని, బయట ఎక్కడ చూసినా నిధి ఆ హీరోతోనే కనపడుతుందని వార్తలు వచ్చాయి.
తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన నిధి డేటింగ్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. తాను ప్రస్తుతం సింగల్ గానే ఉన్నానని తెలిపింది నిధి. ఇలాంటి వార్తలకు నేను ఎక్కువ స్పందించనని, అనుకున్నవారు అనుకుంటూనే ఉంటారని, తానేమి భాదపడనని ఆమె అభిప్రాయపడింది. ఇలాంటి వార్తలన్నీ సినిమా రంగంలో మామూలేనని క్లారిటీ ఇచ్చింది.
ఎవరినైనా ఇష్టపడితే దాచకుండా మీడియాకు తానే తెలియజేస్తానని తెలిపింది నిధి. తనపై ఇలాంటి రూమర్లు రావడం కొత్తేమి కాదని ఇంతకముందు కూడా వచ్చాయని తెలిపింది. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాలపైనే ఉందని, తీరిక లేకుండా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నానని ఆమె తెలిపింది. వివిధ భాషల్లో అనేక విజయవంతమైన సినిమాలు చేసి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకోవాలని, ఆ కోరికతోనే చాలా కష్టపడుతున్నట్లు అంటోంది నిధి. ఇప్పడే ప్రేమ, పెళ్లి అనే విషయాలను ఆలోచించనని క్లారిటీగా చెప్పింది నిధి. నిధి స్పందన చూసిన కొందరు నిప్పు లేనిదే పొగ రాదు కదా అని చెవులు కొరుక్కుంటున్నారు. ఈ వార్తల్లో ఎంత నిజముందో చూడాలి.