సమంతలో మొదటి నుంచి చురుకుదనం .. చలాకీదనం ఎక్కువే. అంత స్పీడ్ లేకపోతే బహుశా ఆమె ఈ స్థాయికి వచ్చేది కాదేమో. తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఉండేది కాదేమో. నిజం చెప్పాలంటే అక్కినేనివారి ఇంటి కోడలు కూడా అయ్యుండేది కాదేమో. అంతా బాగానే ఉంది కానీ .. తనలో ఇంకా పిల్ల చేష్టలు పోలేదనే విషయాన్ని అప్పుడప్పుడు ఆమెనే చాటుకుంటూ ఉంటుంది. ఆమె అల్లరితనానికీ .. ఆకతాయికి పనులకు .. సోషల్ మీడియా వేదిక అవుతూనే ఉంటుంది. ఇక సమంత ఏదైనా మంచి పోస్ట్ పెడితే అదిరిందమ్మా అక్కినేని కోడలా అని అభినందించే అభిమానులు, ఆమె ఏదైనా తేడా పోస్ట్ పెడితే మాత్రం కామెంట్లతో కత్తులు దూస్తారు.
రీసెంట్ గా కూడా అదే పని జరిగింది .. సమంత దగ్గర స్టైలిస్ట్ గా ప్రీతమ్ జూకాల్కర్ అనే యువకుడు నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. ఆయన గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అలాంటి అతను సోఫాలో కూర్చుని ఉంటే .. అతని ఒళ్లో కాళ్లు పెట్టుకుని పడుకున్న సమంత ఏవో కబుర్లు చెబుతూ నవ్వుతోంది. ఆ సమయంలో అక్కడ మరెవరు ఉన్నారో తెలియదుగానీ, వాళ్లు తీసిన ఆ ఫోటోను సమంత ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అతని గురించి చెబుతూ లవ్ సింబల్ కూడా యాడ్ చేసింది. అతగాడు కూడా ఇన్ స్టా స్టోరీలో ‘లవ్యూ’ అంటూ స్పందించాడు.
Must Read ;- సరికొత్త రికార్డ్ సాధించిన సమంత అక్కినేని

సమంతకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ. అందువల్లనే చాలా తక్కువ సమయంలో ఈ ఫోటో వైరల్ అయిపోయింది. సమంత చేసిన పని కరెక్టుగా లేదంటూ వాళ్లంతా ఆమెపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. తన దగ్గర పనిచేసేవారిని సమంత తన కుటుంబసభ్యుల మాదిరిగా చూసుకుంటూ ఉండొచ్చు. కానీ ఆ సాన్నిహిత్యాన్ని చాటుకునే పద్ధతి ఇది కాదంటూ అభిమానులు మండిపడ్డారు. ముందుగా ఫోటో .. ఆ తరువాత లవ్ సింబల్ పోస్టు .. రెండూ అభ్యంతరకరమైనవే కావడంతో ఇంతగా అభిమానులు రియాక్ట్ అయ్యారు. దాంతో సమంత వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
సమంతను ఒక హీరోయిన్ గా ఎంతగా ఆదరిస్తారో .. అక్కినేనివారి ఇంటి కోడలిగా ఆమెను అంతగాను అభిమానిస్తారు. అక్కినేనివారి కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి. ఆ కుటుంబానికి చెందినవారంతా వాటిని కాపాడుకుంటూనే వస్తున్నారు. అందువలన సమంత తాను ఏ పని చేస్తున్నా, ఆ కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలనేదే అభిమానులు వ్యక్తం చేసే అభిప్రాయం. ఈ విమర్శలతో .. వివాదంతోనైనా ఆ విషయాన్ని సమంత అర్థం చేసుకుంటుందనే ఆశిద్దాం.
Also Read ;- అక్కినేని బ్రదర్స్ లో విన్నర్ గా నిలిచేదెవరు.?











