అక్కినేని నాగచైతన్య నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. నాగచైతన్య – ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా పై బారీ అంచనాలు ఉన్నాయి. చైతన్య నటించిన మజిలీ, వెంకీమామ చిత్రాలు సక్సస్ సాధించడంతో లవ్ స్టోరీ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తాడని అభిమానులు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు.
Also Read:-సాయిపల్లవి అంత పారితోషికం డిమాండ్ చేసిందా?
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన లవ్ స్టోరీ మూవీ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్వకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు థియేటర్లో 50 శాతం సిటింగ్ కే పర్మిషన్ ఇచ్చాయి.
Also Read:-అక్కినేని బ్రదర్స్ లో విన్నర్ గా నిలిచేదెవరు.?
అందుచేత 100 శాతం సిటింగ్ కి పర్మిషన్ వచ్చినప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందని రిలీజ్ వాయిదా వేశారు. ఇప్పుడు సమ్మర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీని రిలీజ్ చేయనున్నారు. మే నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ కి సక్సస్ చాలా అవసరం. అందుచేత ఈ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఏప్రిల్ లో చైతన్య లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.. మే నెలలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అంటూ అఖిల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి.. ఈ సమ్మర్ లో అక్కినేని బ్రదర్స్ ఇద్దరు విజయం సాధిస్తారో.. లేక ఇద్దరిలో ఒకరే సక్సస్ సాధిస్తారో చూడాలి.
Must Read:-అఖిల్ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం?