క్రిస్మస్ కు ఇంకా రెండు వారాలే ఉండడంతో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత అక్కినేని కూడా పండుగ మూడ్ లోకి వచ్చేసింది. హైదరాబాద్ లో ఉన్న తన ఇంటిని అందంగా డెకరేట్ చేసుకుంది సమంత. ఎక్స్ మస్ ట్రీ , మరికొన్ని ఇతర వస్తువులతో స్వయంగా తానే తన ఇంటిని డెకరేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు సమంత.
ఈ వీడియోలో తను ఎంతో కష్టపడి పెయింటింగ్ చేస్తూ, ఇల్లును శుభ్రం చేస్తూ కనపడింది. 2020వ సంవత్సరంలో తనకు ఇష్టమైన సమయాన్ని ఒక బోర్డుపై రాసుకుంది సమంత. మంచి మంచి హార్ట్ షేప్ లో ఉన్న స్టిక్కర్లను కూడా ఆ బోర్డుకు అతికించారు.ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తమ అభిమాన హీరోయిన్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు చెపుతున్నారు సమంత అభిమానులు. అంతేకాకుండా వీడియోలను అక్కినేని అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. ఇక ప్రతీ క్రిస్మస్ కు సమంత పేదవారికి తన వంతు సహాయం చేస్తోంది. అలాగే ఈ క్రిస్మస్ కు కూడా అనేక మందికి తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సహాయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు సమంత. ఇక క్రిస్మస్ పండుగ నాడు తన సొంత ఊరు వెళ్లే పనిలో సమంత ఉందని సమాచారం.
Must Read ;- చాలా గ్యాప్ తర్వాత షూటింగ్ లో సామ్