పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ఏంసీఏ డైరెక్టర్ వేణుశ్రీరామ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ లో సక్సస్ సాధించిన ‘పింక్’ మూవీకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. పవర్ స్టార్ రీ ఎంట్రీ మూవీ కావడంతో అభిమానులు వకీల్ సాబ్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.
ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ‘వకీల్ సాబ్’ టీజర్‌కు యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ లభించాయి. ఫస్ట్ లుక్ అండ్ టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో.. సినిమా విజయం పై టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ‘వకీల్ సాబ్’ కామిక్ బుక్ అంటూ ఓ అభిమాని నిఖిల్ అనుదీప్ ఓ బుక్ ని డిజైన్ చేసాడు.
ఈ బుక్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసాడు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. అంతే కాకుండా.. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి ఈ కామిక్ బుక్ తెగ నచ్చేసిందట. తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఈ వకీల్ సాబ్ కామెక్ బుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.