మన సామ్ జామ్ సమంత అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక విలన్ గానూ ఆమె విశ్వరూపాన్ని త్వరోనే ప్రేక్షకులు చూడబోతున్నారు. అదే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2. నటనను పండించాలంటే విలన్ పాత్రల్లోనే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కాబోతోంది. యాక్షన్, డ్రామా, థ్రిల్ అంశాలలో ఈ సిరీస్ రూపొందింది. టీజర్ వీడియో ద్వారా అమెజాన్ వీడియోస్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇందులో ఓ కీలక పాత్రను మనోజ్ బాజ్ పాయ్ పోషిస్తున్నాడు.
మరో కీలక పాత్ర ప్రియమణిది. ఈ పాత్ర ప్రయోగాత్మకంగా కనిపించడం వల్లే తను ఒప్పుకున్నట్టు సమంతా చెబుతోంది. దీని షూటింగ్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. అక్టోబరులోనే విడుదల కావలసి ఉన్నా వాయిదా పడుతూ చివరికి ఫిబ్రవరిలో ప్రసారానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆమెను నెగిటివ్ రోల్ లో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఓ పక్క టీవీ షోలు చేస్తూ బిజీగా ఉన్న సమంత త్వరలోనే సొంత నిర్మాణం వైపు మొగ్గుచూపే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. శ్రీకాంత్ తివారి అనే పాత్రను మనోజ్ బాజ్ పాయ్ పోషించాడు.
ఈ టీజర్ లో ‘శ్రీకాంత్ మిషన్ వెనకున్నది ఎవరు? శ్రీకాంత్ వెనకున్నది ఎవరు?’ అనే ప్రశ్నార్థకంతో ఆసక్తిని రేకెత్తించేలా టీజర్ ను విడుదల చేశారు. సమంత ప్రమాదకరమైన మనిషి అనేలా ఆ బ్యాగ్రౌండును సృష్టించారు. సుమన్ కుమార్ దీనికి రచన చేయగా రాజ్ నిడుమోరు, కృష్ణ డీకే రూపొందించారు. పాత కథకు ఇది కొనసాగింపు మాత్రమే. ఇందులో ఇంకా షరీబ్ హష్మి, దర్శన్ కుమార్, శరద్ కేల్కర్, సన్నీ హిందూజా, శ్రేయా ధన్వంతరి, షాహాబ్ అలీ, వేదాంత్ సిన్హా, మహేక్ ఠాకూర్ తదితరులు నటించారు. విలన్ గా సమంత ఎలా నటించిందో తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 12 వరకూ ఆగాల్సిందే.
Also Read: లేటెస్ట్ ఫోటోస్ తో మెస్మరైజ్ చేస్తోన్న అందాల సమంత