ఆల్ జీబ్రాలో సెక్స్ కు ఎంత విలువ ఉందో కోబ్రాలాంటి మనిషి జీవితంలోనూ సెక్స్ కు అంతే విలువ ఉంది. సెన్స్.. సెక్స్.. ఈ రెండింటికీ అవినాభావ సంబంధముంది. అప్పుడే మీ జీవిత భాగస్వామితో చేసే వ్యాపారంలో సెన్సెక్స్ దూసుకుపోతుంది.
ప్రకృతి, పురుషుడు అనేవి సృష్టి ధర్మం. ప్రకృతికి విరుద్దం గా వెళితే సృష్టి సమతౌల్యం దెబ్బతింటుంది. అసలు సెక్స్ ఎలా చేయాలి? ఎంత సేపు చేయాలి? రోజుకు ఎన్ని సార్లు చేయాలి? స్త్రీలు సెక్స్ టైమ్ లో ఏం ఇష్టపడతారు?.. లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే అందరికీ మంచిదేమో. దీని మీద అనేక అధ్యయనాలు జరిగాయి. సెక్స్ మాట్లాడితే తప్పు.. సెక్స్ చేస్తే తప్పు అనే భావనలు ఇప్పుడు దాదాపు తొలగిపోయాయి. సెక్స్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అధ్యయనాలు ఎప్పట్నుంచో చెబుతున్నాయి.
ఇటీవలే నాలుగు వేలమందితో ఓ అధ్యయనం జరిగింది. అమెరికన్ పరిశోధకులు యూకే, యూఎస్ ల నుంచి నాలుగు వేల మంది మహిళలను, పురుషులను ఈ అధ్యయనంలో చేర్చారు. ఈ విషయంలో ఎవరు ఎలా ఫీలయ్యారో నమోదు చేశారు. వీరంతా 18 నుంచి 38 సంవత్సరాల వయసులో ఉన్నవారు. తమ భాగస్వామి ఎక్కువ సేపు సెక్స్ చేయాలని స్త్రీలు కోరుకుంటారట. ఎక్కువ సేపు తమకు తృప్తిని ఇవ్వలేకపోతున్నారని అసంతృప్తితో ఉంటారట. ఇలాంటి అంశాలన్నీ వీరి అధ్యయనంలో తేలాయి.
అడిగిన ప్రశ్నలు – వచ్చిన సమాధానాలు
శృంగారంలో ఎంత సేపు ఉంటారు? సంభోగం ఎంతసేపు కావాలని కోరుకుంటారు?
– దీనికి వీరిచ్చిన సమాధానం ప్రకారం సెక్స్ 25.51 నిమిషాలు ఉండాలి. ఇలా చేయడం వల్ల స్త్రీలకు మంచి అనుభూతి కలుగుతుంది. అదే పురుషులకైతే 25.43 నిమిషాలు ఉండాలి.
ఎంతసేపు ఉంటున్నారో చూద్దాం. పురుషులు 11.14 నిమిషాలు మాత్రమే సెక్స్ చేయగలుగుతున్నారు. దీనివల్ల స్త్రీలలో అసంతృప్తి కలుగుతోంది.
Also Read ;- నిద్రించే ముందు దంపతులు చేయకూడని పనులేమిటో తెలుసా?
సెక్స్ కోసం కోరుకునే సమయం?
పురుషులు రాత్రి సమయాల్లో సెక్స్ కావాలని కోరుకుంటారట. మహిళలు ఉదయానే కావాలని కోరుకుంటారు. దీనికి కారణం మహిళలు రాత్రి సమయాల్లో అలసిపోయి ఉంటారు. అందుకే ఉదయానే కోరుకుంటారు.
అతి సర్వత్రా వర్జియేత్
అతి ఎప్పుడూ అనర్థదాయకమే. అతిగా తిన్నా అతిగా సెక్స్ చేసినా బతుకుబండి గాడి తప్పుతుంది. వయసు పెరిగే కొద్దీ కోరికలు తగ్గుతాయి. సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. మనం వయసులో ఉన్నట్టు తినలేం.. అలా చేయలేం. వయసు మళ్లాక ఒక్క పూట భోజనం ఎలా చేస్తున్నామో సెక్స్ కూడా అలాంటిదే. అయితే అది మనిషి సామర్థ్యాన్ని బట్టి సెక్స్ అనేది ఉంటుంది. ఇది ఇద్దరికీ సంబంధించిన విషయం. వీరిలో ఏ ఒక్కరికి అయిష్టత ఉన్నా కుదరదు. అదే అసంతృప్తికి కారణమవుతుంది.
భార్యాభర్తలు విడిపోవడానికి కూడా కారణమవుతుంది. సెక్స్ చేయడానికి వయసుతో పనిలేదు.. సామర్థ్యాన్ని బట్టి ఏ వయసులో ఎన్నిసార్లయినా సెక్స్ లో పాల్గొనవచ్చు. టీనేజ్ దాటాక సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి. రోజులో ఎక్కువ సమయాన్ని అందుకే కేటాయిస్తారు. అందువల్ల ఆ వయసులో రోజుకు మూడు లేదా నాలుగు సార్లు సెక్స్ లో పాల్గొన్నా ఏమీ కాదు. 36 ఏళ్లు దాటిన వారిలో సెక్స్ సామర్థ్యం క్రమంగా తగ్గుతుంది. అందుకే వీరికి నెలకు పది సార్ల సెక్స్ సరిపోతుందట.
దీనివల్ల గుండె జబ్బులు కూడా రావట. 40 ఏళ్లు దాటితే ఏడాదికి 100 సార్లు సెక్స్ సరిపోతుందని డాక్టర్లు అంటున్నారు. అంటే వారానికి 3 నుంచి 5 సార్లు చేస్తే రోగాలు రావని అంటున్నారు. మనిషి బతకడానికి రోజూ ఆహారం కావాలి. అది ఏ జీవికైనా అంతే. మైధునం కూడా అలాంటిదే. మనిషి బతకడానికి ఆహారం ఎలా అవసరమో మనసు బతకడానికి శృంగారం అంత అవసరం. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా అసమతౌల్యం తప్పదు. హార్మోన్లు అదుపు తప్పి అనారోగ్యానికి కారణం అవుతాయి.
Also Read ;-ఈ ఆహారంతో ‘రోగనిరోధక శక్తి’ని పెంచుకోండిలా..
మంచం మీదే మీ ఇష్టాలు, అయిష్టాలు
మనిషి దేనికి స్పందిస్తాడు, దేనికి స్పందించడో చాలా అవసరం. మీరు ఇష్టపడే వ్యక్తులు, స్థానాలు, వాటిని అర్థం చేసుకోగలిగే భాగస్వామి ఉంటే జీవితంలో మధురానుభూతులు ఉంటాయి. మీ కోరిక లేమిటో భాగస్వామికి ముందే చెప్పండి. అందుకు అనుగుణంగా మీరు ఉండండి. మీరు మాట్లాడే మాటలు, మీ చేష్టలు ఈ విషయంలో మీకు బాగా సహకరిస్తాయి. ఈ విషయంలో మీ భాగస్వామికీ మీకూ సారూప్యత చాలా అవసరం అనే విషయాన్ని గుర్తించండి.
* ఎన్ని ఒత్తిడులు ఉన్నా అవి మంచం మీదకు రానీయకండి. ఆర్థిక సమస్యలు, అప్పులు, ఆఫీసులో వేధింపులు.. ఇలాంటివన్నీ మంచం మీదకు చేరకూడదు. ఒత్తిడికి దూరంగా ఉంటేనే శృంగారపరంగా సరైన అనుభూతిని పొందగలరు. శృంగారంలో మీరు పొందే రిలాక్సేషన్ మీలోని అనేక ఒత్తిడులను దూరం చేస్తుంది, జీవితంపై ఆశను పెంచుతుంది. యోగా, ధ్యానం చేస్తే ఎలాంటి ప్రశాంతత లభిస్తుందో శృంగారంలోనూ అలాంటి ప్రశాంతతే లభిస్తుంది.
* స్త్రీకి తాను అందంగా లేను అనే భావనే రానీయకూడదు. ఆ భావన ఆమెకు ఉంటే సెక్స్ లో అనుభూతిని ఆస్వాదించడం అసాధ్యం. ఎప్పుడూ పాజిటివ్ బాడీ ఇమేజ్ ఆమెలో ఉండాలి. తరచూ ఎక్సర్ సైజ్ లు చేయడం, ఆహారవిహారాలు నియమబద్ధంగా ఉండటం చాలా అవసరం.
* మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న భావనను అసలు రానీయకండి. ఇలాంటి ఆందోళన ఉంటే లైంగిక ఆనందాలను ఆస్వాదించడం అసాధ్యం. అందువల్ల ఇద్దరి మధ్యా భావసారూప్యత చాలా అవసరం. మీ భాగస్వామిలో మీకు ఏదైనా నచ్చకపోతే ఓపెన్ గా చెప్పండి.
* ఇద్దరి మధ్యా గత జీవితాల చర్చ కూడా అనవసరం. గతం తాలూకు లైంగిక సంబంధాలను పాజిటివ్ గా తీసుకునే దృక్పథం ఇద్దరిలోనూ ఉండాలి. అనుమానాలు దూరం కావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇద్దరి మధ్యా అబద్ధాలకూ, అనుమానాలకూ తావు ఉండకూడదు.
– హేమసుందర్ పామర్తి
Also Read ;- వీటిని తింటే.. కొవ్వు ఇట్టే కరిగిపోతుంది..