బాలీవుడ్ యంగ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపూత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఆయన మరణంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. మరణాంతరం రిలీజ్ చేసిన ఆటాప్సి రిపోర్టు ప్రకారం ముంబై పోలీసులు సుశాంత్ ది ఆత్మహత్యగా నిర్దారణ చేశారు. ముంబై పోలీసులు చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అతనిని హత్య చేశారంటూ వార్తలు ప్రచారం జరిగాయి. ఈ వార్తల నేపథ్యంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు చేసిన ఫిర్యాదుతో కేసు కీలక మలుపు తీసుకుంది. ఆయన చేసిన ఫిర్యాదుతో రంగంలోకి బీహార్ పోలీసులు, ఈడీ రంగంలోకి దిగింది. మరోవైపు కేసుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్రం సీబీఐ దర్యాప్తు ఆదేశించింది.
సీబీఐ తమ విచారణలో ఈ కేసుకు సంబందించి పలువురిని విచారించింది. ఈ విచారణలో డ్రగ్స్ కోణం బయటపడటంతో ఎన్సీబీ కూడా రంగంలోకి దిగింది. ఎన్సీబీ అధికారులు దూకుడు పెంచడంతో బాలీవుడ్ సినీ ప్రముఖులు విచారణకు వచ్చారు. దీంతో సీబీఐ విచారణ మందగించి సుశాంత్ సింగ్ కేసు డైవర్ట్ అయిందని విమర్శలు ప్రచారం జరుగుతున్నాయి. సుశాంత్ కుటుంబ సభ్యులు, సుశాంత్ పర్సనల్ లాయర్ కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సుశాంత్ లాయర్ ఇప్పటి వరకు ఫోరెన్సిక్ తుది నివేదిక రాలేదని దీంతో సుశాంత్ కేసును డైల్యూట్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ కేసులో సీబీఐ మీడియా సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.
విమర్శలు ప్రచారం జరుగుతున్న వేళ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సుశాంత్ మరణం తుది నివేదికను ప్రభుత్వానికి అందచేసింది. మృతదేహంలో ఎలాంటి విషం లేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. సుశాంత్ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయాడని అధికారులు తెలిపారు. ఆయన డీఎన్‌ఏను పూర్తిగా పరిశీలించి నివేదికను సమర్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని తెలిపారు. మహారాష్ట్ర వైద్యులు నివేదిక ఇచ్చిన విషయాలే తమ పరిశీలనలోనూ నిర్ధారణ అయ్యాయని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. మానసిక ఒత్తిడి కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని వారు నిర్దారించారు.
ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన తుది నివేదికతో అనుమానాలకు బ్రేక్ పడతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.











