పీవీసింధు బ్యాడ్మింటన్ రంగంలో దేశానికి వన్నెతెస్తూ పలు అంతర్జాతీయ టోర్నీల్లో ప్రతిభ కనబరుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో ఆమె ప్రతిభకు పురస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు డిప్యూటీ కలెక్టరుగా ప్రభుత్వోద్యోగాన్ని ఇచ్చింది. అప్పటినుంచి ఆమె ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు.
పీవీసింధు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ కు వీలుగా ఉండేలా.. ఆమె హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ వాటాకు వచ్చిన లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఓఎస్డిగా పీవీ సింధు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడివిధుల్లో ఉంటూ ఆన్ డ్యూటీలో ఉంటున్నారు. ఆమె ఆన్ డ్యూటీ ఫెసిలిటీ ఆగస్టు 30తో ముగిసిపోయింది.
తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో క్రీడాకారిణి పీవీ సింధుకు మరో ఏడాదిపాటు ఆన్ డ్యూటీ ఫెసిలిటీ కల్పిస్తూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వచ్చే ఏడాది ఆగష్టు 31 వరకు ఆన్ డ్యూటి ఫెసిలిటీ కల్పించారు.











