మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజూపండగే’ సినిమాల విజయాలతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం తేజు నటించిన ‘సోలో బ్రతుకే సో బెటరు’ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మించగా, నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహించాడు. నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ చిత్రం విడుదలయ్యే లోపే కొత్త సినిమాను మొదలుపెట్టాడు తేజు. దీనికి దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ మొదలుకాగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ముందుగా ఇందులో హీరోయిన్ గా నివేదా పేతురాజ్ ను తీసుకోవాలని అనుకున్నారు మేకర్స్ . ఆమె కూడా ఈ స్టోరీ విని ఓకే చెప్పారని టాలీవుడ్ లో టాక్ నడిచింది. గతంలో తేజు, నివేదా పేతురాజ్ కలిసి ‘చిత్రలహరి’లో నటించి మెప్పించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అందుకే వీరిద్దరినీ ఫైనల్ చేసారని వార్తలు వినిపించాయి.
అయితే కారణమేంటో తెలియదు కానీ.. చివరికి ఈ సినిమాలో హీరోయిన్ గా నివేద స్థానంలో ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నారని సమాచారం. మున్ముందు ఈ విషయంపై చిత్ర బృందం ఏమైనా క్లారటీ ఇస్తారేమో చూడాలి. ఇక ఈ సినిమాను దర్శకుడు దేవ కట్టా యాధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నారు. చిత్రానికి ‘రిపబ్లిక్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సీనియర్ నటి రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. దేవా కట్టా సినిమా అంటే సహజంగానే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ ను దర్శకుడు ఏవిధంగా చూపిస్తాడో చూడాలి మరి.











