తెలుగమ్మాయి అయినప్పటికీ.. తమిళనాట బాగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్. అక్కడ అంతగా గ్లామర్ పాత్రలు చేయకపోయినా.. తన పెర్ఫార్మెన్స్ తోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. ముందు నుంచీ ఆమెకు ఛాలెంజింగ్ రోల్స్ చేయడం ఇష్టం. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక అద్భుతమైన పాత్ర ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. మలయాళంలో గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ తమిళ వెర్షన్ లో .. కథానాయికగా ఐశ్వర్యా రాజేష్ నటించబోతోంది.
మలయాళంలో నిమిషా సజయన్ కథానాయికగా నటించగా.. హీరోగా సురాజ్ వెంజారమూడ్ నటించారు. ఒక సాంప్రదాయ కుటుంబానికి కోడలుగా వెళ్ళిన ఒక అమ్మాయి.. ఆ ఇంట్లో వారి నుంచి ఎలా ఇబ్బందులు పడింది? ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? చివరికి ఆ అమ్మాయి తన ఇండి విడ్యువాలిటీని ఎలా నిలబెట్టుకుంది అనే కథాంశంతో రూపొందింది ఈ సినిమా. సింపుల్ స్టోరీతో చాలా హృద్యమైన సన్నివేశాలతో .. అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. అందుకే ఈ సినిమాను తమిళంలో నిర్మించబోతున్నారు. హీరోగా రాహుల్ రవీంద్రన్ నటించబోతున్నాడు. మరి ఈ సినిమా ఐశ్వర్యాకి ఏ రేంజ్ లో పేరొస్తుందో చూడాలి.
Must Read ;- అనుపమ నోట వచ్చింది అలాంటి పాటా?










