సౌత్ జనానికి మంచి గాయని, అంతకు మించి నటీమణి అయిన ఆండ్రియా జెర్మియా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎప్పుడో 14 ఏళ్ళ క్రితం నటీమణిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. నిజానికి సింగర్ గా తన కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. హీరోయిన్ అయ్యాకా .. సింగింగ్ అండ్ డబ్బింగ్ తగ్గించింది. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పాత్రలు పోషించడంలో ఆండ్రియా దిట్ట. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే టాలెంట్ ఆమెది. అందుకు తమిళ, మలయాళ, తెలుగు చిత్రాల్లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఆఖరికి విలన్ గానూ నటించి మెప్పించింది.
ఈ ఏడాది ఆండ్రియా జెర్మియా ‘మాస్టర్’ సినిమాలో అతిథి పాత్రలో తళుక్కున మెరిసి.. ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘పిశాచు 2, మాళిగై, కో’ అనే మూవీస్ లో డిఫరెంట్ పాత్రలు పోషిస్తోంది. సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్స్ తాత్కాలికంగా ఆగిపోయాయి.
ప్రస్తుతం చెన్నై కరోనా కోరల్లో చిక్కుకొని లాక్ డౌన్ లో ఉంది. ఈ టైమ్ ను ఆండ్రియా చాలా చక్కగా వినియోగించుకుంటోంది. నిరంతరం యోగాలోనే మునిగి తేలుతూ ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసిన యోగా భంగిమలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మెడకండరాలపై ఒత్తిడి పెంచే ఈ ఆసనం. .. మెడ నొప్పిని తగ్గించి బ్రెయిన్ లోంచి ఒత్తిడిని రిలీజ్ చేస్తుంది. మొత్తంమీద ఈ అందాల భామ.. యోగా విన్యాసాలు ఇన్ స్టా ను ముంచెత్తుతున్నాయన్నమాట.
Must Read ;- అందాల నడి‘బొడ్డు’న పూనమ్ బజ్వా