నిన్నటి తరం అందాల హీరోయిన్ మీనా ఇప్పుడు .. ఇటు సినిమాల్లో నటిస్తూనే అటు.. వెబ్ సిరీస్ లో కూడా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. లాక్ డౌన్ కు ముందు కరోలిన్ కామాక్షి అనే తమిళ వెబ్ సిరీస్ లో నటించింది. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ మీద ఫోకస్ పెట్టింది. ఓ తమిళ నూతన దర్శకుడు ఈ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇందులో మరో సీనియర్ నటీమణి జయసుధ కూడా ముఖ్య పాత్ర చేస్తోంది.
వయసు అయిపోయిన తల్లి కోసం , తన భర్తని, పిల్లల్న వదిలేసి.. ఆమెకు సేవ చేసుకొనే హృద్యమైన పాత్రలో మీనా నటిస్తున్నట్టు సమాచారం. ఇందులో తల్లిగా జయసుధ, కూతురిగా మీనా నటిస్తూండడం విశేషం. రెండు పాత్రలు చాలా ఎమోషనల్ గా కదలిస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం మీనా తెలుగు దృశ్యం షూటింగ్ కోసం హైద్రాబాద్ లో ఉంది. ఈ సినిమాలోని ప్రధాన సన్నివేశాల్ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు జీతు జోసెఫ్. తమిళంలో ఒక సినిమాతో పాటు సీరియల్ లోనూ నటిస్తున్న మీనాకి ఈ వెబ్ సిరీస్ ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- విలక్షణ నటుడి సరసన మళ్ళీ జోడీ కడుతోందట.. !











