కోలీవుడ్ లో ఎంతమంది కమర్షియల్ హీరోలున్నా.. ధనుష్ రూటే వేరు. మనోడితో కామెడీ వర్కవుట్ అవుతుంది, పక్కా మాస్ సినిమా తీయొచ్చు.. అలాగే.. పూర్తి రా సినిమా, అవార్డు అందుకొనే కథలతో సినిమాలు తీయొచ్చు. అతడితో ఎలాంటి సినిమా తీసినా.. నిర్మాతలకు కాసుల వర్షం కురియడం విశేషం. అందుకే కోలీవుడ్ లో ధనుష్ తో సినిమా తీయడానికి దర్శకులు ఎంతో ఆసక్తి చూపిస్తారు.
లేటెస్ట్ గా విడుదలైన ‘కర్ణన్’ సినిమా తమిళనాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓటీటీలోనూ ఈ సినిమాకి భాషలకతీతంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ప్రస్తుతం తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ధనుష్ త్వరలోనే తెలుగులో స్ట్రైట్ మూవీలో నటిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ భారీ సంస్థ ధనుష్ తో చర్చలు జరుపుతోందట. ఎప్పటి నుంచో ధనుష్ తెలుగులో నటించాలనుకుంటున్నాడు.
తమిళంతో పాటు తెలుగులో నూ అతడి సినిమాలు విడుదలవుతుంటాయి. కొన్ని మూవీస్ తమిళంతో సమానంగా ఇక్కడ సూపర్ హిట్టయ్యాయి. ఈ నేపథ్యంలో ధనుష్ తో ఓ మాస్ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. తెలుగుతో పాటు ఈ సినిమా తమిళంలోనూ నిర్మాణం జరుపుకోబోతోంది. మరి ధనుష్ సినిమా తెలుగులో ఏ రేంజ్ వర్కవుట్ అవుతుందో చూడాలి.
Must Read ;- ‘కర్ణన్’ తెలుగు వెర్షన్ .. ప్రధాన పాత్రలో రావు రమేశ్ ?