క్రికెటర్ బుమ్రాతో అనుపమా పరమేశ్వరన్ కు మధ్య ఏంజరిగిందో ఏమో గాని సోషల్ మీడియాలో మాత్రం ఇది ఓ పెద్ద రచ్చలా మారింది. బుమ్రాతో ఆమెకు ప్రేమ వ్యవహారం నడిచిందన్న వదంతి ఎప్పటి నుంచో ఉంది. అయితే వారిద్దరి మధ్య స్నేహం తప్ప ఇంకేమీ లేదన్నది అనుపమ కుటుంబికుల వాదన. బుమ్రా వివాహం మాజీ మిస్ ఇండియా ఫైనలిస్టు సంజనా గణేశన్ తో జరిగిపోయింది. అసలు బుమ్రాని అనుపమ పెళ్లాడబోతోందన్న వార్త ఆ మధ్య చక్కర్లు కొట్టింది. క్రికెటర్లకు ఇలాంటి ప్రేమాయణాలు కొత్త కాదు. ఆ మధ్య అనుపమ గుజరాత్ వెళ్లి రావడంతో ఈ అనుపమ పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై అనుపమ తల్లి కూడా వివరణ ఇచ్చింది.
అనుపమ గుజరాత్ నుంచి ఇలా వచ్చిందో లేదో బుమ్రా పెళ్లి వార్త అలా వచ్చేసింది. ఇక్కడితో ఆగిపోయినా ఏ గొడవా ఉండేది కాదు. అనుపమ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పాట పాడుతూ పోస్టు పెట్టింది. మలయాళంలో ఉన్న ఈ పాట విషాదగీతమనీ, విరహ వేదనతోనే అనుపమ ఈ పోస్టు పెట్టిందని మరో ప్రచారం ప్రారంభమైంది. తనపై బయట వదంతులు ఉన్నప్పుడు అనుపమ కూడా ఇలాంటి పోస్టులు పెట్టకుండా ఉండి ఉంటే బాగుండేది. బుమ్రాతో ప్రేమ వ్యవహారం మాటేమోగాని అది బూమ రాంగ్ అయ్యింది.
అది కమ్యూనిస్టు ఇన్ స్పిరేషనల్ సాంగ్, నిరాశ, నిస్పృహలు వద్దు, ధైర్యంగా పోరాడాలనే స్ఫూర్తిదాయకమైన పాట అది. అనుపమ పాడింది మలయాళ పాట కావడంతో దాని అర్థం కోసం అందరూ తంటాలు పడుతున్నారు. మనసు మాట వినాలని, అలా వింటేనే మనం ఏదైనా చేయడానికి ఓ మార్గం ఉంటుందనేది ఆ పాట సారాంశం. అందుకే గుండె దిటవు చేసుకుని ధైర్యం తెచ్చుకుంటే జీవితం అనేక మలుపులు తిరుగుతుందంటూ ఆమె పాట పాడింది.
అయితే ఈ పాటలో కూడా తమకు కావలసిని అర్థాన్ని వెతుక్కుంటున్నారు నెటిజన్లు. అందుకే ఊరుకున్నంత ఉత్తమం బోడి గుండంత సుఖం ఉండదంటారు పెద్దలు. ఆమె ఇలాంటి పోస్టులేవీ పెట్టకుండా ఉంటే జనం ఇంతలా ఆలోచించేవారు కాదేమో. ఇది విషాదగీతం కాదని, స్ఫూర్తిమంతమైన గీతమని జనం తెలుసుకుంటే మంచిది. అసలు కొంత ఆమె ఇన్ స్టా పోస్టులే ఆమెపై లేనిపోని వదంతులు వ్యాప్తి చెందడానికి కారణమయ్యాయి.
Must Read ;- చేపకళ్ల అనుపమా .. చిలిపి చూపుల చిరునామా (బర్త్ డే స్పెషల్)











