చిత్రపరిశ్రమలో ప్రేమ పెళ్లిలు సర్వసాధారణం.ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి సంఖ్య చాంతాడంత ఉంది. ప్రేమ పేరుతో చెట్టాపట్టాలేసుకుని బయటపడిన వారు మాత్రం చాలా అరుదు.కానీ ఆది పినిశెట్టి మాత్రం అందుకు భిన్నంగా తన ప్రేమను రహస్యంగా కొనసాగించారు. ఏళ్ల తరబడి ఎవ్వరికి తెలియకుండా సాగిన ఈ ప్రేమ వ్యవహారం ఈ ఏడాది మార్చిలో బయటికి రావడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు ప్రేక్షకులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
హీరోగా ప్రతి నాయకుడిగా ప్రేక్షకుల మదిని దోచుకున్న హీరో ఆది పినిశెట్టి ఓ ఇంటి వాడవ్వబోతున్నాడు. మలుపు చిత్రంలో హీరోయిన్ గా తనతోపాటు నటించిన నిక్కి గర్లానీని పెళ్లి చేసుకున్నారు. మలుపు చిత్ర నిర్మాణం లో ఇరువురు ప్రేమలో పడగా ఏడేళ్ల తర్వత ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు.ఇన్నాళ్లు తమ ప్రేమ వ్యవహరాన్ని రహస్యంగా కొనసాగించిన వారు అందిరని ఆశ్చర్యపరుస్తూ మార్చ్ 24న చైన్నైలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్ మెంట్ తర్వాత రెండు రోజులకు ఫోటోలను సామాజికి మాద్యమం లో పోస్ట్ చేసి అందిరిని ఆశ్చర్యపరిచారు.
మే 18న వీరి వివాహ వేడుకలో భాగమైన హల్దీ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలుగు,కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందికి కొద్ది మంది మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొని కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ వ్యవహారాన్ని ఏడేళ్లు దాచిపెట్టిన వీరు ఏడు అడుగులతో ఒక్కటై నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని బందువులు, ప్రేక్షకులు బెస్ట్ విషెష్ తెలుపుతున్నారు.