తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. దాంతో కమల్ హాసన్ రాజకీయాల్లోని బిజీనెస్ కి కూడా తెరపడింది. ఇక ఆయన సినిమా షూటింగ్స్ లో బిజీ అవడమే తరువాయి. ప్రస్తుతం ఆయన ముందు రెండే రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి శంకర్ ‘ఇండియన్ 2’, లోకేశ్ కనగరాజ్ విక్రమ్. ఈ రెండింటిలో కమల్ ముందుగా చేయాల్సిన సినిమా ఇండియన్ 2. అయితే ఈ మూవీ కొన్నాళ్ళుగా కోర్ట్ గొడవల్లో ఉంది. ఇటీవల ఈ సినిమా నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. త్వరలోనే సినిమా తిరిగి సెట్స్ మీదకు వెళ్ళబోతోంది.
ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా.. షూటింగ్ రెస్యూమ్ అవడానికి కాస్తంత టైమ్ పట్టొచ్చు. ఇక ఇండియన్ 2 ముగియకుండా.. కమల్ .. లోకేష్ కనగరాజ్ విక్రమ్ షూటింగ్ లో పాల్గొనడం కుదరదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయన ఇండియన్ 2 ను కంప్లీట్ చేయాలి. అలా ఈ రెండు సినిమాల షూటింగ్స్ మరింత లేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ గ్యాప్ లో కమల్ ‘పాపనాశం 2’ ను పట్టాలెక్కించా లనుకుంటున్నాడట.
‘దృశ్యం’ మలయాళ సినిమా అన్ని భాషల్లోనూ రీమేక్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడే ఈ సినిమా కమల్ తో తమిళంలో పాపనాశం పేరుతో అదే దర్శకుడు జీతు జోసెఫ్ తెరకెక్కించాడు. తమిళంలో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇప్పుడు ఆ సినిమాకే సీక్వెల్ తీయాలనుకుంటున్నాడట. ఇటీవల మలయాళంలో విడుదలైన ‘దృశ్యం 2’ సినిమాని దర్శకుడు జీతు .. కేవలం 46 రోజుల్లో కంప్లీట్ చేయగా.. తెలుగు వెర్షన్ ను 47 రోజుల్లో పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అందుకే కమల్ అతి తక్కువ టైమ్ లో ‘పాపనాశం 2’ ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాడట. ఈ విషయం గురించి జీతుతో చర్చలు కూడా జరుపుతున్నారట కమల్. మరి ‘పాపనాశం 2’ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో చూడాలి.
Must Read ;- కమల్ హసన్ కు విలన్ గా రాఘవ లారెన్స్ ?