6నెలలుగా కరోనా మహమ్మారి ప్రభావంతో థియేటర్స్ తెరవడం లేదు. షూటింగ్స్ జరగడం లేదు. అయితే ఇంత కరోనా కాలంలో కూడా ఒక బాలీవుడ్ మూవీ షూటింగ్ ప్రారంభించి.. అప్పుడే చిత్రీకరణ కూడా పూర్తి చేసుకోవడం అందరికీ షాకిస్తోంది. సినిమా పేరు ‘బెల్ బాటమ్’. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా పీరియాడికల్ మూవీగా తెరకెక్కింది. నిజానికి ఈ సినిమాని 2019 లో అనౌన్స్ చేశారు. సినిమా ప్రారంభమయ్యే టైమ్ కి కరోనా లాక్ డౌన్ వచ్చి పడింది. ఆ టైమ్ లో ఇండియాలో ఏ సినిమా షూటింగ్స్ కూ అనుమతులు ఇవ్వలేదు. అయితే బెల్ బాటమ్ సినిమా యూనిట్ ఆగస్ట్ లో స్కాట్ ల్యాండ్ లో సినిమా ప్రారంభించి.. ఈ సెప్టెంబర్ నెలఖరుతో పూర్తి చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
1980 లో బాలీవుడ్ లో కొందరు మరిచిపోలేని హీరోల శకం నడుస్తోంది. ఆ టైమ్ లో జరిగే కొన్ని వాస్తవ సంఘటనలతో ‘బెల్ బాటమ్’ సినిమా తెరకెక్కింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. వాణీ కపూర్, హ్యూమా ఖురేషీ, లారా దత్తా లాంటి తారాగణంతో .. రంజిత్ యమ్. తివారీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పూర్తయిన సందర్భంగా అక్షయ్ ట్విట్టర్ లో ఈ సినిమా అతి తక్కువ సమయంలో పూర్తికావడానికి సహకరించిన టీమ్ మెంబర్స్ కు ధన్యవాదాలు తెలుపుతూ.. బెల్ బాటమ్ పోస్టర్ ను కూడా పోస్ట్ చేశాడు. నోస్టాల్జిక్ లుక్ లో అక్షయ్ భలేగా ఉన్నాడు. మరి బెల్ బాటమ్ ఖిలాడీకి ఏ రేంజ్ లో సక్సెస్ ఇస్తుందో చూడాలి.
Alone we can do so little, together we can do so much. Its teamwork and I am grateful to each and every member of the cast and crew. #BellBottomCompleted. Here’s the poster
.@Vaaniofficial @humasqureshi @LaraDutta @vashubhagnani @ranjit_tiwari @jackkybhagnani @honeybhagnani pic.twitter.com/Wyf08FMcen— Akshay Kumar (@akshaykumar) October 1, 2020











