ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి న్యాయవ్యవస్థ మీద పూనుకున్న దాడి పట్ల.. ఇంకా నిరసనలు, అధిక్షేపణలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. సుప్రీం కోర్టు న్యాయమూర్తికి వక్ర ప్రయోజనాలు ఆపాదిస్తూ ముఖ్యమంత్రి, చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం, అంతకు మించి ఆ లేఖను మీడియాకు విడుదల చేయడం అనేది.. సర్వత్రా గర్హనీయం అవుతోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో అనేక మంది న్యాయనిపుణులు, న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు ఈ చర్యను తప్పుపట్టారు. తాజాగా.. ఆల్ ఇండియా జడ్జిల అసోసియేషన్ కూడా.. ఈ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది.
ఈ మేరకు ఆల్ ఇండియా జడ్జిల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజయ్ నతాని ఒక ప్రకటన విడుదల చేశారు. గౌరవ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీద ఆరోపణలు గుప్పిస్తూ అక్టోబరు 6వతేదీన రాసిన లేఖను ప్రచురించడాన్ని ఈ సంఘం తీవ్రంగా తప్పుపట్టింది.
రాజకీయ అధికారంలోని వారు తీసుకుంటున్న చర్యలు – న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను దెబ్బతీసేలా, అప్రతిష్ట పాల్జేసేలా, పరువు తీసేలా ఉన్నాయని జడ్జిల సంఘం అభిప్రాయ పడింది. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత వ్యవస్థను తప్పుపట్టేలా- వీరి చర్యలు ఉన్నాయని గర్హించింది. ఈ మేరకు ఆల్ ఇండియా జడ్జిల సంఘం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తీర్మాన ప్రతిని పత్రికలకు విడుదల చేశారు.
మరింతగా ముదురుతోంది..
సుప్రీం న్యాయమూర్తి మీద, న్యాయవ్యవస్థ మీద ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ మరింత పెద్ద వివాదంగా ముదురుతోంది. న్యాయనిపుణులు అందరూ కూడా ఇలాంటి చర్యను గర్హిస్తూనే ఉన్నారు. మరి జగన్మోహనరెడ్డి నష్ట నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.
జడ్జిల సంఘం తీర్మానం ప్రతి ఇదే :












