కరోనా వల్ల ప్రపంచానికి వాటిల్లిన నష్టం మనకు తెలిసిందే. ఈ మహమ్మారి బారినపడి లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికీ ఆ చావులు ఆగలేదు. అయితే కరోనాను కట్టడి చేసేందుకు విశ్వవ్యాప్తంగా సైంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని వ్యాక్సిన్లు మొదటి దశలో ఉంటే, మరికొన్ని రెండవ, మూడవ దశలో క్లినికల్ ట్రయల్స్‌ను జరుపుకుంటున్నాయి. ఇవి సత్ఫలితాలిచ్చి మార్కెట్లోకి రావాలంటే ఇంకా కొన్ని నెలలు ఆగాల్సిందే. మరీ అప్పటిదాకా జరుగుతున్న నష్టాన్ని పూడ్చడమేలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఒక అధ్యయనంలో కోవిడ్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను శాస్త్రజ్ఞునులు బయటపెట్టారు.
మన బాడీలోనే వ్యాక్సిన్..
కరోనాను ఎదుర్కోవడానికి కావల్సిన మందు మన శరీరంలోనే ఉందని ఆ అధ్యయనంలో తేలింది. శరీరం సహజంగా ఉత్పత్తి చేసే సెల్.. సిగ్నలింగ్ అణువు అయిన నైట్రిక్ ఆక్సైడ్ కరోనా నుండి మనల్ని రక్షిస్తుందని ఆ అధ్యయనంలో నిపుణులు కనుగొన్నారు. అదే మనకు కరోనాకు చికిత్సగా కూడా పనిచేస్తుంది. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు రోగులను నైట్రిక్ ఆక్సైడ్ నయం చేస్తుందని కనుగొన్నారు. అలాగే ప్రాణాలను కూడా కాపాడే శక్తి దానికుందని స్వీడన్ సైంటిస్టులు తెలిపారు.
కరోనాకు ఇప్పటి వరకు మందు ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ప్రస్తుతం రోగుల వైద్యం కోసం యాంటీ వైరల్ డ్రగ్లనే చికిత్సలో వాడుతున్నారు. రెమిడెసివిర్ ఔషధాన్ని చికిత్సలో వైద్యులు ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. రెమిడెసివిర్ ఔషధాన్ని మొదట ఎబోలా చికిత్స కోసం వాడేవారు. అయితే ఇప్పుడు ఇదే ఔషధాన్ని కోవిడ్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల చికిత్సకూ వాడుతున్నారు. సత్ఫలితాలు ఇస్తుండటంతో అధిక శాతం ఇదే మందును చాలా దేశాలు వాడుతున్నాయి. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఈ ఔషధం కరోనా కేసులు, మరణాలను తగ్గించలేదని పేర్కొంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొన్ని దేశాలు ఇదే ఔషధాన్ని వాడుతున్నాయి.
దానిలో తగ్గించే గుణం..
ఇదిలా ఉంటే శరీరం సహజంగా ఉత్పత్తి చేసే అణువు అయిన నైట్రిక్ ఆక్సైడ్ రోగులకు ఉపశమనం ఇస్తుందని సైంటిస్టులు పేర్కొంటున్నారు. నైట్రిక్ ఆక్సైడ్ అణువు వాసోడైలేటర్ అనే రక్త ప్రవాహాన్ని పెంచడానికి రక్త నాళాలను విడదీస్తుంది. తద్వారా శరీరంపై రోగ నిరోధక ప్రభావాలను కలిగి ఉండి కరోనా బారినుండి రక్షించే గుణం దానికి సహజసిద్ధంగానే ఉంటుందని స్వీడన్లో కోతుల మీద జరగిన ఓ అధ్యయనంలో తేలిందట. ఏదేమైనా శాస్త్రజ్ఞనులు కనుగొన్న ఈ అంశం కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనకు ఊరటకలిగిస్తోంది.