దేశంలో కరోనా మరణాలు ఒక్క సారిగా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. కేసుల పెరుగుదల స్పల్పంగా ఉన్నా మరణాలు రెండింతలు అయ్యాయి. నిన్న వరకు మూడు వేల లోపు ఉన్న మరణాల సంఖ్య ఈ రోజు ఏకంగా 6,148 కు చేరింది. కరోనా మరణాల రేటులో ఇదే రికార్డు. దేశంలో గడచిన 24 గంటల్లో 94,052 కేసులు నమోదు అయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 3,59,676 మంది వైరస్‌తో చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 11,67,952 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 24,27,26,693 మందికి టీకాలు వేసినట్లు అధికారులు తెలిపారు.
Must Read ;- వృథా చేస్తే కోతే.. టీకాల పంపిణీకి కేంద్రం కొత్త మార్గదర్శకాలు