దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా సెకండ్ వేవ్ క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. తాజాగా 1,00,636 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. మరో 2,427 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,71,59,180 మంది కోలుకోగా, 14,01,609 మంది చికిత్స తీసుకుంటున్నారు.
పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో పలు రాష్రాలు సండలింపులు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం పాక్షికంగా ఆంక్షలు ఎత్తివేసింది. ఇక తెలంగాణలో కూడా అన్ లాక్ ప్రక్రియ మొదలుకానుంది. రేపు క్యాబినెట్ భేటీలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ మరింత సడలించే దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- దేశంలో మరో ప్రమాదకర కరోనా వేరియంట్..











