జూన్ 21 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి ఉచితంగా కరోనా టీకాలు అందజేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.దేశంలో ప్రస్తుతం కేసులు సంఖ్య తగ్గినా కరోనా సెకండ్ వేవ్‌లో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగింది. దీనిపై సోమవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ దేశ ప్రజలందరికీ కరోనా టీకాలు ఉచితంగా అందజేయనున్నట్లు ప్రకటించారు.కరోనా థర్డ్ వేవ్ ముప్పును అధిగమించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ప్రైవేటు ఆసుపత్రులు కరోనా టీకాకు రూ.150 కంటే ఎక్కువ తీసుకోవద్దని,తీసుకుంటే చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
Must Read ;- కరోనా టీకాలనూ కొనని జగన్ సర్కారు.. ధైర్యముంటే ప్రధానిని నిలదీయాలన్న పట్టాభి











