Allu Arjun Icon Movie Stopped
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించనున్న సినిమా అంటూ ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న సినిమా ఐకాన్. అల్లు అర్జున్ కి బాగా నచ్చి కథ ఇది. ఇంకా చెప్పాలంటే.. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ బన్నీతో సినిమా చేయాలని ఎంతో ఇష్టంతో రాసుకున్న కథ. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ అఫిషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఈ సినిమా లేదట అని వార్తలు వచ్చిన ప్రతిసారీ బన్నీ ఫ్రెండ్ బన్నీ వాసు ఐకాన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేవారు.
పుష్ప తర్వాత ఐకాన్ మూవీ చేయనున్నాడు అని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా.. దసరాకి ఐకాన్ మూవీని ప్రారంభం అని కూడా టాక్ వచ్చింది. దీంతో బన్నీ అభిమానులు ఐకాన్ మూవీ దసరాకి పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవుతుంది అనుకున్నారు. అయితే.. ఏమైందో ఏమో కానీ దసరాకి ఐకాన్ మూవీ స్టార్ట్ కాలేదు. దీంతో మరోసారి ఐకాన్ మూవీ వార్తల్లో నిలిచింది. తెర వెనుక ఏం జరిగింది..? అసలు ఐకాన్ మూవీ ఉందా.? లేదా ? అని ఆరా తీస్తే.. అసలు విషయం బయటకు వచ్చింది. మేటర్ ఏంటంటే.. ఐకాన్ మూవీ చేయడానికి బన్నీ ప్రస్తుతం ఇంట్రస్ట్ చూపించడం లేదట.
Allu Arjun Icon Movie Stopped
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేసేందుకే బన్నీ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడని సమాచారం. దీంతో ఐకాన్ డైరెక్టర్ వేణుశ్రీరామ్ మరో హీరోతో మరో సినిమా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడని సమాచారం. గతంలో నేచురల్ స్టార్ నానితో వేణుశ్రీరామ్ సినిమా కన్ ఫర్మ్ అంటూ వార్తలు వచ్చాయి. మరి.. ఈ వకీల్ సాబ్ డైరెక్టర్ నానితో సినిమా చేస్తాడా..? లేక మరో హీరోతో సినిమా చేస్తాడా..? బన్నీ ఐకాన్ మూవీని ప్రస్తుతానికి ఆపేసాడా..? పూర్తిగా చేయకూడదు అనుకుంటున్నాడా..? క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.