ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న మూడో సినిమా ‘పుష్ప’. ‘ఆర్య, ఆర్య 2’ సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవెల్లో బహుభాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ.. పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో వీర మాస్ లుక్ లో రఫ్ అండ్ టఫ్ మేకోవర్ తో అలరించబోతున్నాడు.
రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప’ టీజర్ అభిమానుల్ని ఎంతగానో అలరించింది. రష్మికా మందన్న కథానాయికగా, యాంకర్ అనసూయ ప్రత్యేక పాత్రలోనూ నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. మైత్రీ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న పుష్ప సినిమాకి ఆగస్ట్ 13న విడుదల తేదీ ప్రకటించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. షూటింగ్ నిలిచిపోయింది. అలాగే.. విడుదల తేదీ కూడా మారబోతోంది.
ఇక తాజా గా ‘పుష్ప’ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. అదేంటేంట.. పుష్ప సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందట. ఈ విషయాన్ని మీడియా ఇంటరాక్షన్ లో నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ వెల్లడించారు. ఎంతో స్పాన్ ఉన్న సబ్జెక్ట్ పుష్ప. ఇలాంటి కథను రెండున్నర గంటల్లో చెప్పడం కష్టం. అందుకే అల్లు అర్జున్, సుకుమార్, మేము కలిసి సినిమాను రెండు భాగాలుగా తీయడానికి నిర్ణయించాం అని తెలిపారు. ఫస్ట్ పార్ట్ పూర్తి కాగానే.. రెండో భాగం షూటింగ్ ప్రారంభిస్తాం. అంతేకాదు ఆల్రెడీ రెండో భాగానికి సంబంధించి 10 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని చెప్పారు. మరి ‘బాహుబలి, కేజీఎఫ్’ తరహాలో ‘పుష్ప’ కూడా సంచలన విజయం సాధిస్తుందేమో చూడాలి.