పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న జాప్యానికి రాష్ట్రం తప్పిదమని కేంద్రం మరోసారి తేల్చి చెప్పింది. పోలవరం ప్రస్తుత స్థితి.. జాప్యానికి కారణాలపై సమాచార హక్కు చట్టం కింద చైతన్యకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవిద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ నెల 13న లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది.
పోలవరం నిర్మాణం ఆలస్యం కావడానికి, ఖర్చు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఈ సమాధానంలో తెగేసి చెప్పారు. 2019 నుంచి 2023 వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.7654.23 కోట్ల రీయింబర్స్‌మెంట్ ఇచ్చామని పీపీఏ డైరెక్టర్ పీడీ రావు తెలిపారు. పోలవరం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఇంకా, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థను మార్చింది. భూసేకరణ, పునరావాస కార్యక్రమాల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
ప్రస్తుత నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్… ప్రణాళిక మరియు వ్యూహాత్మక కార్యకలాపాల్లో తీవ్రంగా విఫలమవుతోంది. ప్రాజెక్టు నిర్మాణ డిజైన్లను సమర్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆలస్యం చేస్తోంది, అలాగే ఆమోదించబడిన డిపిఆర్ డిజైన్లలో మార్పులు మరియు చేర్పులు చేయబడ్డాయి. అయితే వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఎదుగడ్డ మొదలు పెట్టింది, పోలవరం ప్రాజెక్టుని 2030కి పూర్తి చేస్తాం అని కొత్త మాట చెప్తున్నారు.
ఒకవైపు రాజధాని ఊసేలేదు, మూడు రాజధానులు నిర్మాస్తా అని ప్రగల్బాలు పలికిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కి ఒక్క రాజధానిని కూడా నిర్మాంచాలేని ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి జగన్ అని తేలిపోయింది. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండి 5యేండ్లు కావొస్తుంది ఇంకెప్పుడు రాజధాని నిర్మిస్తాడు? ఎక్కడ ఏ ప్రాంతాన్ని రాజధానిగా ఫైనల్ చేస్తాడు? అని అందరు ఎదురు చూస్తున్నారు కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం సమయం వృధా చేస్తుందే తప్ప పని చేయడం చేత కాదని తేలిపోయింది.. ఇలా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఏ హామీలని కూడా నెరవేర్చకపోగా ఉట్టి కాకమ్మ కబుర్లు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారు.