ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యావ్యవస్థపై బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏపీ విద్యావ్యవస్థను తెలంగాణతో పోల్చడం సరికాదన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యావ్యవస్థ విఫలమైందన్నారు. “బొత్స సత్యనారాయణ ముందు మీకు ఎన్ని గురుకులాలు ఉన్నాయో.. మాకు ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి. ఎక్కడ తల పెడతావు.. నీకు విద్యావిధానం ఉందా.. మా విద్యార్థుల గురించి మాట్లాడు. మాకు 1009 గురుకులాలుంటే.. మీకు 289 కూడా లేవు.. TSPSCలో దొంగలను పట్టుకున్నది మేమే. ఏపీపీఎస్సీలో సీతారామరాజు అనే దొంగ దొరికాడు. జగన్ దొంగ డ్రామాలను ప్రజలు చూస్తున్నారన్నారు. తెలంగాణపై ఇంకా కుట్ర జరుగుతోందా? అని మంత్రి గంగుల విరుచుకుపడ్డారు.
అలాగే సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. ఉమ్మడి పాలనలో పాపాలు కడుగుతున్నాయన్నారు. మన ఊరు.. మన బడితో పాఠశాల రూపురేఖలు మార్చుకున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
అయితే బొత్స సత్యనారాయణ మాటలకి గంగుల కమలాకర్ ఎదురు దాడికి దిగారు ముందు మీ మూడు రాజధానులు ఎక్కడున్నాయి? అసలు మీ రాజధాని ఎదో సరిగ్గా తెలియదు నువ్వు తెలంగాణ విద్య వ్యవస్థ గురించి మాట్లాడుతున్నావ్. నీది నువ్వు చూసుకోకుండా పక్కోడి మీద పడి ఏడుస్తున్నావ్, మీ సీఎం జగన్ కి చెప్పు పోయి రాజధాని లేని పాలన గుద్ది పాలన అని చెప్పు అని బొత్స కి గట్టి సమాధానం ఇచ్చాడు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్.. తెలంగాణ మంత్రులకి అడ్డంగా బుక్ అయిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ దెబ్బకి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తెల్లమొహం వేసాడని సమాచారం. నీకు దమ్ముంటే నీ ఆంధ్రని డెవలప్ చేసి అక్కడ మాట్లాడు, ఇక్కడ కాదు అని తెలంగాణ మంత్రులు ఇస్తున్న కౌంటర్కి బొత్సకి మాట పడిపోయింది..