ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత రాష్ట్రానికి రాజధాని నగరంగా అమరావతిని ఎంచుకోవడం జరిగింది. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోజున (అక్టోబర్ 22) అమరావతి నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో శంకుస్థాపన జరిగింది.
గత ప్రభుత్వ పాలనలో రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. రాష్ట్రానికి పాలన విభాగం మొత్తం ఇక్కడే నుంచే కొనసాగింది. ప్రభుత్వాలు మారిన తరువాత ఇప్పటి ముఖ్యమంత్రి ఏకంగా ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ ప్రకటన చేసి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. సీఎం మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులందరూ దీక్షలు చేపట్టారు. రోజులు గడుస్తున్నాయే కానీ అమరావతి విషయం గురించి అటు పీఎం కానీ, సీఎం కానీ కనీసం నోరు మెదపడం లేదు. దీంతో ఇక విషయం గురించి సోషల్ మీడియాలో తమ పోరాటం సాగించాలనుకుంటున్నారు అమరావతి రైతులు, వారికి మద్దతు ఇచ్చేవారు.
సోషల్ మీడియానే వేదికగా పోరాటం..
ఇప్పటి వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పోరాటం చేసిన ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, దేశ ప్రధాన మంత్రి కానీ ఈ విషయంపై ఏమి స్పష్టత ఇవ్వకపోవడంతో సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వినిపించాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.

అందుకు వారు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఉద్యమం మొదలు పెట్టారు. ‘మన రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగి నేటితో 5 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమానికి మద్దతు తెలపాలి అనుకునే వారు నేరుగా మాతో ఉద్యమంలో పాల్గొనల్సిన అవసరం లేదు. మీరున్న చోటు నుంచే మాకు మద్దతు తెలపవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్లో వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్ యాప్ లు ఉంటే చాలు’
మీ పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చి అకౌంటు క్రియేట్ చేసుకుని అమరావతి పై మీ గళం విప్పండి. ట్విటర్ లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పేర్లను ట్యాగ్ చేస్తే చాలు వారికి మన వాదన తెలిసే అవకాశం ఉంటుంది.
ట్విటర్ లో ఉపయోగించాల్సిన ట్యాగ్ లు
@rashtrapatibhavn
@VPSecretariat
@MVenkaiahnaidu
@PMOindia
@narendramodi
@HMOindia
@Amitshah
సోషల్ మీడియాలో అమరావతి ఉద్యమ సమాచారం కోసం ఈ అకౌంట్స్ ఫాలో అవ్వండి.
Facebook : https://www.facebook.com/SaveCapitalAmaravati (లైక్ చేయండి)
Twitter : https://twitter.com/APWithAmaravati (ఫాలో అవ్వండి)
మీ చేతిలో ఉన్న ఫోన్ ఉపయోగించండి, ఈ దేశానికి అమరావతి గళం వినిపిద్దాం
జై అమరావతి… జై ఆంధ్రప్రదేశ్..
#5YrsForAmaravatiFoundation
#AmaravatiPeoplesCapital
#OneStateOneCapital
#SaveAmaravati
#SaveAmaravatiFarmers
#SaveAndhraPradesh
#SaveCapitalAmaravati
#SaveFarmers
ట్యాగులను ఫేస్ బుక్ లో ఉపయోగించి ఉద్యమ తీవ్రతను అందరికీ తెలిసేలా చేయాలనుకుంటున్నట్లు అమరావతి ఉద్యమదారులు స్పష్టం చేసారు.











