బిగ్ బి అమితాబ్ లో స్పీడ్ ఏ మాత్రమూ తగ్గలేదు. ఎనిమిది పదుల వయసులో కూడా వేగంగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా గుడ్ బై చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైంది. రష్మిక మందన్నతో అమితాబ్ ఈ లుక్ లో కనిపించారు. ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ సినిమాతో రష్మిక బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఇంతకుముందు పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలో కనిపించినా రష్మిక కు హిందీలో ఇదే తొలిసినిమా. అమితాబ్ తోపాటు నీనా గుప్తా, రష్మిక ఈ సినిమాలో కనిపిస్తారు. ఇటీవలే అమితాబ్ మరోసారి కోవిడ్ కు గురైన సంగతి తెలిసిందే.
ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నందున ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. కాకపోతే జూమ్ కాల్ ద్వారా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ఏడాది 5 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు తెలిపారు. ఈ వయసులో కూడా ఇంత వేగంగా సినిమాలు చేయడంపై ప్రశ్నిస్తే ఇది నాకు కొత్త విషయం కాదు. నెల క్రితం కూడా సినిమాలు విడుదలయ్యాయి. ఏడాదిలో 7-8 సినిమాలైన రోజులున్నాయి.
కోవిడ్ కారణంగా సినిమాల విడుదల ఆలస్యమైంది. జుండ్, రన్‌వే 34 తర్వాత బిగ్ బి నటించిన బ్రహ్మాస్త్ర ఈ నెల 9న విడుదలవుతోంది. రణబీర్ కపూర్, అలియా భట్‌ల ఇందులో జంటగా నటించారు. అమితాబ్ కోవిడ్ నుంచి కోలుకున్నా బయట తిరగవద్దని డాక్టర్లు సూచించారట. అందుకే జూమ్ మీటింగ్ ద్వారా మీడిమా ముందుకు వచ్చినట్టు తెలిపారు. ఏక్తా ఆర్ కపూర్ బాలాజీ మోషన్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ఈ ఏడాది అక్టోబరు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అమితాబ్ మాత్రం తన నటనకు ఇప్పట్లో గుడ్ బై చెప్పేలా లేరు.