ప్రైవేటీకరణకు కళాశాలు వడివడిగా అడుగులు ..!
రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాల, పాఠశాలలకు ఎయిడ్ ను రద్దు చేస్తూ తీసుకొచ్చి 42, 50 జీవోలు పేద, మధ్య తరగతి విద్యార్థుల జీవితంతో తీవ్ర అఘాతాలను సృష్టించాయి. ఈ రెండు జీవోలతో డెబ్బై ఏళ్ల నాటి ఎయిడెడ్ భూ స్థాపితమైంది. ఎయిడెడ్ విద్య కాస్తా .. ప్రైవేటు విద్యగా రూపాంతరం చెందింది. ఏపీలో ప్రస్తుతం 137 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలు, 122 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు, 1,988 పాఠశాలలు ఉన్నాయి. ఈ విద్య సంస్థల ద్వారా మొత్తం 3 లక్షల 74 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో విలీనం చేయడం ఇష్టంలేక అనేక కళాశాలు, పాఠశాలలు ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నాయి! అనంతపురం ఎస్ఎస్బీఎన్ కళాశాల యాజమాన్యం కూడా ఎయిడెడ్ అంటూనే ప్రైవేకరించేందుకు అడుగులు వేస్తోంది. దీంతో విద్యార్థులకు ఫీజులు పెనుభారంగా మారే అవకాశం ఉంది. దీనిని ఎంతమాత్రం ఒప్పకోమని విద్యార్థలు మంగళవారం నిరసనకు దిగారు. టీఎన్ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపారు.
అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు…!
అనంతపురం ఎస్ఎస్బీఎన్ కళాశాల యాజమాన్యం ఎయిడెడ్ గా కొనసాగిస్తామని చెబుతునే.. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. యాజమాన్యం చర్యలతో విద్యార్థుల రోడ్డుపడే ప్రమాదం ఏర్పడుతోందని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కళాశాల గేటు ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షకు అన్ని విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపారు. ఎయిడెడ్ గా కొనసాగిస్తూనే .. అధిక ఫీజలు వసూలు చేయడం ఏమిటని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 70 రోజులుగా విద్యార్థులు నిరసనలు, ధర్నాలు చేస్తున్నా.. కళాశాల యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఎయిడెడ్ విద్యాలయాలను ప్రైవేటికరణ చేయడం సరికాదని హెచ్చరించారు. ఫీజులు తగ్గించే వరకు తమ నిరసన పోరాటాలు కొనసాగుతాయని విద్యార్థులు స్పష్టం చేశారు.











