ధాన్య కొనుగొళ్లపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టండి..!
కేసీఆర్ అవినీతి చిట్టను బయటకు తీసి, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలే కాషాయ శ్రేణులను సిద్ధం చేస్తోంది బీజేపీ అధిష్టానం! ‘అపరేషన్ తెలంగాణ’ పేరుతో ఢిల్లీ నుంచి అమిత్ షా డైరెక్షన్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్ కేంద్రంపై చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలని భావిస్తున్నారు. అందుకు తగిన విధంగా, వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల మధ్య అనేక కార్యక్రమాలు చేపట్టి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టాలని తెలంగాణ బీజేపీకి నాయకులకు అమిత్ షా కర్తవ్యబోధ చేసినట్లు తెలుస్తోంది. అలానే ప్రజా సమస్యల పోరాటంలో వెనకడు వేయడకుండా.. చాలా ఫోర్స్ గా ముందుకు పోయేలా తెలంగాణ భాజాపా సిద్ధమౌతోంది. మంగళవారం ఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతను తెలంగాణ బీజేపీ నేతలు సమావేశం అయ్యారు.
కేసీఆర్ కుంభకోణాలను ప్రజలకు అర్థమయ్యే చెప్పాలి ..!
ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాతో మంగళవారం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైయ్యారు. ఈ భేటికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, పీయూష్, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, మాజీ మంత్రులు ఈటల రాజేంద్రర్, డీకే అరుణ, ఎంపీ అర్వింద్, మాజీ ఎంపీ జితేంద్రర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఇతర నేతలు హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశం అసాంతం కేసీఆర్ అవినీతి, అధికార పార్టీ నేతల బియ్యం కుంభకోణం, ధాన్య కొనుగోళ్ల విషయం టీఆర్ఎస్ చేస్తున్న రాద్దాంతాన్ని ఎలా తిప్పికొట్టాలి అన్న పలు అంశాలను చర్చించారు. వీటిన్నింటిని ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్లి, పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలనే అంశాలపై అమిత్ షా శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అలానే నిత్యం ప్రజల్లోని ఉండి, వారి సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. ఏదిఏమైనా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండాని అధికార పీఠంపై రెపరెపలాడించేందుకు శ్రేణులు ఉవిళ్లూరుతున్నాయి!